రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. మహర్షి సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసిన ఆయన తన మ్యూజిక్ మహిమతో కరోనా కాలంలో కూడా జనాలను ఉప్పెనలా థియేటర్‌కు తీసుకురాగలిగాడు. తాజాగా అతడు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న రాధే సినిమాలో సిటీమార్ సాంగ్‌కు పని చేశాడు. దువ్వాడ జగన్నాథం(డీజే)లోని ఈ పాట రికార్డులు తిరగరాసింది.
ఎంతో పెద్ద హిటయ్యియన ఈ పాటను సల్మాన్‌కు తెగ నచ్చేసింది. దీంతో రాధే సినిమాలో ఈ పాటను మళ్లీ చేయాలని పట్టుపట్టాడు. అంత పెద్ద హీరో అడిగాక డీఎస్పీ కాదంటాడా? సంతోషంగా ఓకే చెప్పాడు. అలా జానీ మాస్టర కొరియోగ్రఫీలో సిటీమార్.. సిటీమార్.. అంటూ విజిలేస్తూ స్టెప్పులేశాడు. తాజాగా ఈ సాంగ్ రిలీజైంది. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా హుషారుగా చిందులేశాడు. ఇందులో పూజా హెగ్డే పాత్రలో దిశాపటానీ స్టెప్పులేసింది. హిందీ అభిమానులకు కూడా ఈ పాట విపరీతంగా ఎక్కేస్తుంటే తెలుగు అభిమానులు మాత్రం ఒరిజినలే బాగుందని పెదవి విరుస్తున్నారు.
టాలీవుడ్‌కు క్రేజ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని మరికొందరు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సల్మాన్ తనకు నచ్చినట్లు వ్యవహరించే ఓ రౌడీ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ఇతడితో తలపడనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అల్లు అర్జున్‌ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్!
Comments
Please login to add a commentAdd a comment