Laxman Sivaramakrishnan
-
ఏంటమ్మా లుంగీ, ధోతికి తేడా తెల్వదా?: సల్మాన్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'. ఇటీవలే ఈ సినిమా నుంచి 'ఏంటమ్మా' అనే పాట రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్‌తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన డ్యాన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లుంగీ డ్యాన్స్ తరహాలో ముగ్గురు స్టార్ హీరోలు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే ఈ పాటపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాట దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉందంటూ ఆరోపించారు. వెంటనే ఈ సాంగ్‌ను బ్యాన్ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. లక్ష్మణ్ శివరామకృష్ణన్ ట్వీట్లో రాస్తూ..' ఇది చాలా హాస్యాస్పదం. ఈ పాటకు హీరోలు ధరించింది లుంగీ కాదు. ధోతిని లుంగీగా చూపించారు. ఇది దక్షిణ భారత సంస్కృతిని కించపరిచేలా ఉంది. క్లాసిక్ దుస్తులను చాలా అసహ్యకరమైన రీతిలో చూపించారు. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. లుంగీ, ధోతీకి తేడా ఏంటో కూడా కనీసం తెలుసుకోరు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఆలయంలో నటీనటులు షూస్ ధరించి ఎలా డ్యాన్స్ చేస్తారని ప్రశ్నించారు. కాగా.. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జోడీగా తెరకెక్కుతోన్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, పాలక్ తివారీ, జాస్సీ గిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. This is highly ridiculous and degrading our South Indian culture. This is not a LUNGI , THIS IS A DHOTI. A classical outfit which is being shown in a DISGUSTING MANNER https://t.co/c9E0T2gf2d — Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023 -
BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలెక్షన్ కమిటీ రేసులో కొత్త పేర్లు
BCCI New Selection Committee: చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసిన నేపథ్యంలో కొత్త ప్యానెల్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణకు నిన్న (నవంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో 100 వరకు అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్షన్ కమిటీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపించిన లక్ష్మన్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్‌లు దరఖాస్తు చేసుకోలేదన్న వార్త బీసీసీఐ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతానికి సెలెక్షన్ కమిటీకి ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో హేమంగ్ బదానీ, మణిందర్ సింగ్ పేర్లు చైర్మన్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఫైనల్ రిజల్ట్ రావాలంటే, డిసెంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆయా జోన్ల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురు ప్రముఖుల పేర్లు.. సౌత్ జోన్.. హేమంగ్ బదానీ కన్వల్జిత్ సింగ్ వెస్ట్ జోన్.. మణిందర్ సింగ్ నయన్ మోంగియా సలీల్ అంకోలా సమీర్ దీఘే సెంట్రల్ అండ్ నార్త్ జోన్.. అజయ్ రాత్రా గ్యాను పాండే అమయ్ ఖురాసియా అతుల్ వాసన్ నిఖిల్ చోప్రా రితేందర్ సింగ్ సోధి ఈస్ట్ జోన్.. శివ్ సుందర్ దాస్ ప్రభంజన్ మల్లిక్ ఆర్ఆర్ పరిడా శుభోమోయ్ దాస్ ఎస్ లహిరి -
BCCI: కొత్త చీఫ్ సెలక్టర్ ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్-2022, అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం విధితమే. ఈ కమిటీకి చైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా, హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషి (సౌత్ జోన్), దేబశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. సెలక్షన్ కమిటీ రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామకృష్ణన్‌కు బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా శివరామకృష్ణన్ పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. రేసులో ఉన్న అజత్ అగార్కర్‌కు కూడా బోర్డులోని పలువురు ప్రముఖుల మద్దతు ఉండటంతో అతని అభ్యర్ధిత్వాన్ని కూడా తీసివేయడానికి వీల్లేదని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలు.. కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు ఐదేళ్లు పూర్తి అయ్యి ఉండాలి ఐదుగురు సభ్యులకు వయసు పరిమితి 60 ఏళ్లులోపే ఉండాలి 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకొనేందుకు అనర్హుడు