
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు, దిగ్గజ నేత బాల్ థాకరే బయోపిక్‌కు కష్టాలు ఎదురయ్యాయి. బాల్ థాకరే జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన థాకరే మూవీలోని కొన్ని సన్నివేశాలపై కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మూవీలోని ఆరు డైలాగులు, రెండు సీన్ల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు అవసరమైన మార్పులు చేయాలని సూచించింది.
సీబీఎఫ్‌సీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించుకుంటామని చిత్ర బృందం పేర్కొంది. చట్టబద్ధంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలను ఎదుర్కొంటామని, సమస్యను పరిష్కరించుకంటామని చిత్ర నిర్మాత, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా చిత్ర ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం.ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృతారావు మీనా థాకరే పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 23న బాల్ థాకరే జయంతి సందర్భంగా థాకరే మూవీ విడుదలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment