
ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాధుర్
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ వెంట ఉండే ప్రతినిధుల పేర్లను వెల్లడించాలని ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ) ఆర్.కె.మాధుర్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను ఆదేశించారు. ‘జాతీయభద్రత’తో ముడిపడిన అంశమైనందున పేర్లను వెల్లడించలేమంటూ పీఎంవో అభ్యంతరం వ్యక్తం చేయటాన్ని తోసిపుచ్చారు. అయితే, ప్రధాని వెంట ఉండే భద్రతా సిబ్బంది, అధికారుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు.