overseas tour
-
‘పీకే’పై మల్లగుల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరిక అంశం పార్టీ చీఫ్ సోనియాగాంధీ కోర్టుకు చేరింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతో చర్చించి సోనియా నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. పీకే ప్రతిపాదనలపై కాంగ్రెస్ కమిటీ సమర్పించిన నివేదికపై కమిటీ సభ్యులు, సీనియర్లతో సోనియా సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ప్రియాంక గాంధీతో పాటు సుర్జేవాలా, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, పి.చిదంబరం తదితరులు పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరతారా అన్నదానిపై ఓ వైపు చర్చ నడుస్తుంటే మరోవైపు ఆయన తెలంగాణలో టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్న వైనాన్ని సోనియా సమక్షంలో నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో రెండు రోజులుగా పీకే మంతనాలు, ఆ పార్టీతో పీకే సంస్థ ఐప్యాక్ కుదుర్చుకున్న ఒప్పందం తదితరాలను నేతలు వివరించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా చేసిన దిగ్విజయ్‌సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తినట్టు చెబుతున్నారు. పలు ప్రత్యర్ధి పార్టీలతో పీకేకు సంబంధాల దృష్ట్యా పార్టీ నిర్ణయాలను ఆయనతో పంచుకునే విషయంలో గోప్యత పాటించాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. పీకే కాంగ్రెస్‌లో చేరే పక్షంలో పూర్తిగా పార్టీ సేవకే అంకితం కావాలని, ఇతర పార్టీలతో ఎలాంటి సంబంధమూ కొనసాగించొద్దని మరో నేత అన్నట్టు సమాచారం. ‘నీ శత్రువులతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమ్మొద్దు’ అంటూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్ పీకేను ఉద్దేశించేదేనని నేతలన్నారు. ప్రాంతీయ పార్టీలతో పీకేకు సంబంధాలు కాంగ్రెస్‌కు మేలే చేస్తాయని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. -
భారత్ చేతిలో కామన్వెల్త్!
లండన్: అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కామన్వెల్త్ కూటమిలోనూ భారత్ కీలకపాత్ర పోషించాలని బ్రిటన్ సహా పలు కామన్వెల్త్ దేశాలు వెల్లడించాయి. దీంతో, ఇప్పటికే పలు ప్రపంచ వేదికలపై క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భారత్.. కామన్వెల్త్ సమావేశాల అనంతరం మరో కీలకమైన అడుగు ముందుకేయనుంది. ఈనెల 16 నుంచి 20 వరకు లండన్‌లో జరగనున్న కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశాల్లో (చోగమ్) పాల్గొనేందుకు ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ వెళ్లనున్నారు. ‘వివిధ అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, కార్యక్రమాల్లో భారత్ పాత్ర క్రియాశీలకంగా మారింది. అందుకే కామన్వెల్త్లోని అతిపెద్ద దేశంగా భారత్.. ఈ గ్రూపును కూడా ముందుండి నడిపించాలని బ్రిటన్ కోరుకుంటోంది’ అని యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఈ ద్వైవార్షిక కామన్వెల్త్ ప్రభుత్వాల సదస్సుకు భారత ప్రధాని హాజరవటం ఇదే తొలిసారి. సోమవారమే ఈ సదస్సు ప్రారంభం కానున్నప్పటికీ.. మోదీ మంగళవారం రాత్రి లండన్ చేరుకుంటారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్–2 (కామన్వెల్త్ హెడ్) ప్రత్యేకంగా వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపినందుకే మోదీ ఈ సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నారని విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని మోదీ రెండుదేశాల (స్వీడన్, యూకే) విదేశీ పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదురోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా తొలిరోజు స్వీడన్లో మోదీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్తో పలు అంశాలపై విస్తృత చర్చలు జరపనున్నారు. అనంతరం భారత్–నార్డిక్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచానికి ‘భారత్ కీ బాత్’ లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘భారత్ కీ బాత్, సబ్కే సాథ్’ పేరుతో భారత సంతతి ప్రజలు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రపంచాన్నుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం సాయంత్రం (బ్రిటీష్ కాలమానం ప్రకారం) సెంట్రల్ లండన్‌లోని సెంట్రల్ హాల్ వెస్ట్‌మినిస్టర్ వేదిక నుంచి మోదీ ప్రసంగం ప్రారంభం కానుంది. ప్రపంచం నలుమూలల నుంచి సోషల్ మీడియా, లైవ్ వీడియో లింక్‌ల ద్వారా వచ్చే ప్రశ్నలకు మోదీ సమాధానాలిస్తారు. అలాగే థేమ్స్ నది ఒడ్డున ఉన్న బసవేశ్వర (12 శతాబ్దపు సంఘసంస్కర్త) విగ్రహానికి ప్రధాని పుష్పాంజలి ఘటించనున్నారు. -
ఆ వ్యాపారవేత్తల పేర్లు వెల్లడించండి
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ వెంట ఉండే ప్రతినిధుల పేర్లను వెల్లడించాలని ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ) ఆర్.కె.మాధుర్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను ఆదేశించారు. ‘జాతీయభద్రత’తో ముడిపడిన అంశమైనందున పేర్లను వెల్లడించలేమంటూ పీఎంవో అభ్యంతరం వ్యక్తం చేయటాన్ని తోసిపుచ్చారు. అయితే, ప్రధాని వెంట ఉండే భద్రతా సిబ్బంది, అధికారుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. -
బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే బాబు విదేశీ యాత్రలు
జడ్డంగి(రాజవొమ్మంగి) : బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుచూ విదేశీ యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు దీనిని సహించరని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ రాజవొమ్మంగి మండల కన్వినర్ సింగిరెడ్డి రామకృష్ణ ఇంట జడ్డంగిలో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన నెహ్రూ తిరిగి వెళుతూ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించడం సరికాదన్నారు. పిల్లలను కనాలని చెబుతున్న సీఎం మనకు లభిస్తున్న ఆహారశాతం ఎంత, పెరుగుతున్న జనాభా ఎంతనేది బేరీజు వేసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ జననాలరేటు పెరిగితే అది తమ ప్రభుత్వ ఘనతేనని చంద్రబాబు చెప్పుకోవాలని చూస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. మన దేశంలో, రాష్ట్రంలో యువరక్తానికి లోటులేదని వారికి తగిన అవకాశాలు చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలకు పౌష్టికాహారం అందజేసేందుకు కృషి చేయాలని ఆయన సీఎంకు సూచించారు. ప్రస్తుత మానవవనరులను మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామా అన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ఎక్కడో జపాన్‌లోని పరిస్థితులను మనకు అన్వయించాలని చూసేముందు ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆకళింపుచేసుకోవాలి కదా అని పేర్కొన్నారు. రుణమాఫీ ఒక అంకెల గారడీ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ బలోపేతం వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో, జిల్లాలో రోజురోజుకు బలోపేతమవుతుందని నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. మరో మూడు నెలలో పార్టీ సభ్యత్వాల నమోదులో అద్భుత ఫలితాలను చూడవచ్చన్నారు. ఆయనతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ చప్పా నూకరాజు, సర్పంచ్ కొంగర మురళీకృష్ణ తదితర వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ప్రత్తిపాడు ఎంఎల్ఏ. పరుపుల సుబ్బారావు కూడా హాజరయ్యారు.