
సంచిలో చిన్నారి మృతదేహం
గుంటూరు టౌన్: గుంటూరు రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఓ సంచి కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ లో 1వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై అనుమానాస్పద బ్యాగ్ ను గర్తించిన రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా సంచిలో చిన్నారి(నెలల పాప) మృతదేహాం బయటపడింది. ప్రయాణికులు ఎవరైనా సంచిని వదిలివెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్టేషన్ లోని సీసీ పుటేజ్ ను పరిశీలించి సంఘటనపై పూర్తి విచారణ చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.