నీళ్లట్యాంకులో గుర్తు తెలియని శవం
Published Tue, Oct 18 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు సమీపంలో నీళ్లట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం సమాచారం అందుకున్న కర్నూలు రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఉలిందకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, దూపాడు వీఆర్‌ఓ బాలన్న సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలోపు ఉంటుంది. శరీరంపై బట్టలు లేవు. 8 అడుగుల నీటి ట్యాంకులో సుమారు 6 వారాల నుంచి 8 వారాలు మృతదేహం ఉండడంతో పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. ట్యాంకులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. ఫోరెన్సిక్ డాక్టర్ శంకర్ నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement