jagannathagattu
-
రూపాల సంగమేశ్వరస్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
కర్నూలు(న్యూసిటీ) :నగర శివారులో జగన్నాథగట్టుపై వెలసిన రూపాల సంగమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి, ఫస్ట్‌క్లాస్ అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి హేమావతి, జూనియర్ సివిల్ జడ్జి స్వప్నరాణి అభిషేకం నిర్వహించారు. అర్చకులు ముందుగా న్యాయమూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించారు. అర్చకులు సురేష్ శర్మ, దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
నీళ్లట్యాంకులో గుర్తు తెలియని శవం
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు సమీపంలో నీళ్లట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం సమాచారం అందుకున్న కర్నూలు రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు, దూపాడు వీఆర్ఓ బాలన్న సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలోపు ఉంటుంది. శరీరంపై బట్టలు లేవు. 8 అడుగుల నీటి ట్యాంకులో సుమారు 6 వారాల నుంచి 8 వారాలు మృతదేహం ఉండడంతో పూర్తిగా కుళ్లిపోయి గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొంది. ట్యాంకులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. ఫోరెన్సిక్ డాక్టర్ శంకర్ నాయక్‌తో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.