టేకుమట్ల పాత బ్రిడ్జి కింద మృతదేహాం లభ్యం | unknown deadbody found | Sakshi
Sakshi News home page

టేకుమట్ల పాత బ్రిడ్జి కింద మృతదేహాం లభ్యం

Published Mon, Aug 15 2016 1:38 AM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

టేకుమట్ల పాత బ్రిడ్జి కింద మృతదేహాం లభ్యం - Sakshi

టేకుమట్ల పాత బ్రిడ్జి కింద మృతదేహాం లభ్యం

మృతదేహానికి తల, చేతులు, కాళ్లు లేని వైనం
మూటలో కట్టి వేచినట్లు ఆనవాళ్లు
సూర్యాపేటరూరల్‌: తల, చేతులు, కాళ్లు లేని ఓ మృతదేహాం ఆదివారం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామ సమీపంలోని మూసీవాగు పాత బ్రిడ్జి కింద స్థానికులకు కనిపించింది. స్థానికులు వెంటనే వీఆర్‌ఓ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం 35 నుంచిl40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిని ఎక్కడో హత్య చేసి తల, కాళ్లు, చేతులు నరికి వేసి మిగతా శరీరాన్ని ఓ కవర్‌లో మూటకట్టి బ్రిడ్జిపై నుంచి వాగులోకి వేశారు. మృతదేహాం నీళ్లల్లో పడకుండా ఓ రాయిపై పడడంతో కవర్‌ ఊడిపోయింది. 15 నుండి 20 రోజుల క్రితం దీనిని వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట పట్టణ సీఐ మొగిలయ్య సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించారు. వీఆర్‌ఓ విజయరామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనువాస్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement