హైదరాబాద్కు దేవశిష్ బోస్ మృతదేహం | Devashish bose deadbody sent to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు దేవశిష్ బోస్ మృతదేహం

Published Tue, Jun 10 2014 8:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Devashish bose deadbody sent to Hyderabad

హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దేవశిష్ బోస్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. మంగళవారం ఉదయం లభ్యమైన దేవశిష్ బోస్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాత్రి తీసుకువచ్చారు. అతని తల్లిదండ్రులు కూడా ఇదే విమానంలో వచ్చారు.

మరో నాలుగు మృతదేహాలను సోమవారం రాత్రి హైదరాబాద్కు తరలించారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్కు 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement