రెండో ఇన్నింగ్స్ లో 232/6
మొత్తం ఆధిక్యం 142 పరుగులు
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్
గువాహటి: హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ రంజీ ట్రోఫీ మ్యాచ్ మూడో రోజు సాధారణ స్థితికి చేరుకుంది. రెండో రోజు ఘోరమైన బ్యాటింగ్‌తో దెబ్బ తిన్న హిమాచల్ ప్రదేశ్ కోలుకునే ప్రయత్నం చేసింది. ఫలితంగా శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. పారస్ డోగ్రా (101 బంతుల్లో 57; 7 ఫోర్లు), రాబిన్ బిస్త్ (113 బంతుల్లో 50 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు.
సిరాజ్, రవికిరణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్‌సలో 126 పరుగులకై ఆలౌటై 90 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. బాలచందర్ అనిరుధ్ (162 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా, రిషి ధావన్‌కు 7 వికెట్లు దక్కారుు. ప్రస్తుతం హిమాచల్ ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో ఉంది.
27 పరుగులకే...
ఓవర్‌నైట్ స్కోరు 99/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ మరో 14.2 ఓవర్లు ఆడింది. ఆరంభంలోనే అనిరుధ్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఏడో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో పరుగులు చేయకున్నా అనిరుధ్‌కు సహకరించిన మిలింద్ (29 బంతుల్లో 1) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనిరుధ్‌ను కూడా ధావన్ అవుట్ చేసిన తర్వాత మరుసటి ఓవర్లోనే హైదరాబాద్ ఆట ముగిసింది.
కీలక భాగస్వామ్యాలు...
తొలి ఇన్నింగ్‌స వైఫల్యం తర్వాత హిమాచల్ జాగ్రత్తగా ఆడింది. ప్రశాంత్ చోప్రా (8)ను రవికిరణ్ తొందరగానే అవుట్ చేసినా... తర్వాతి బ్యాట్స్‌మెన్ నిలకడ ప్రదర్శించారు. దూకుడుగా ఆడిన అంకుశ్ బైన్‌స (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)ను సిరాజ్ అవుట్ చేయడంతో ఆ జట్టు రెండో వికెట్ కోల్పోరుుంది. ఈ దశలో మూడో వికెట్‌కు సుమీత్ వర్మ (58 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్)తో 59 పరుగులు జోడించిన సీనియర్ ఆటగాడు పారస్ డోగ్రా... ఆ తర్వాత బిస్త్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 65 పరుగులు జత చేశాడు. ఈ రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు హిమాచల్‌ను ఆదుకున్నారుు. అనంతరం రిషి ధావన్ (28 బంతుల్లో 20; 4 ఫోర్లు)ను పెవిలియన్ పంపించి మిలింద్ కీలక బ్రేక్‌ను అందించాడు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న హిమాచల్ చివరి రోజు ఆదివారం మరికొన్ని పరుగులు జోడించే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించగలదా అనేది ఆసక్తికరం.
కోలుకున్న హిమాచల్ ప్రదేశ్
Published Sun, Oct 30 2016 11:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement