హైదరాబాద్కు దేవశిష్ బోస్ మృతదేహం
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి దేవశిష్ బోస్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. మంగళవారం ఉదయం లభ్యమైన దేవశిష్ బోస్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాత్రి తీసుకువచ్చారు. అతని తల్లిదండ్రులు కూడా ఇదే విమానంలో వచ్చారు.
మరో నాలుగు మృతదేహాలను సోమవారం రాత్రి హైదరాబాద్కు తరలించారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్కు 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.