నెల్లూరు : నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలంలోని నక్కలవాగులో గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాగు వద్దకు చేరుకుని... మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతదేహం పురుషుడిదిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.