nakkala vagu
-
నక్కల వాగు ఉధృతం
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రత్తిపాడు ప్రాంతంలో శనివారం రాత్రి భారీ, ఆదివారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతుల కళ్లలో ఆశలు కనిపిస్తున్నాయి. ప్రత్తిపాడు–గొట్టిపాడు మధ్యలో లోలెవల్ చప్టాపై ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కలవాగును చిత్రంలో చూడొచ్చు. – ప్రత్తిపాడు -
నక్కలవాగులో గుర్తు తెలియని శవం
నెల్లూరు : నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని నక్కలవాగులో గుర్తు తెలియని మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాగు వద్దకు చేరుకుని... మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. మృతదేహం పురుషుడిదిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.