కర్నూలు(న్యూ సిటీ): హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని హతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు రాస్తారోకోకు దిగాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యలయం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సురేంద్రను నిన్న కొంతమంది వ్యక్తులు హత్య చేశారు. దీంతో మృతుడి బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు.