పుట్టపర్తిలో విదేశీ మహిళ మృతదేహం లభ్యం
Published Fri, Nov 7 2014 10:55 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తిలో అదృశ్యమైన విదేశీ మహిళ హత్య కేసులో పురోగతి కనిపించింది. కొత్త చెరువు మండలం మంకుంటపల్లి వద్ద ఆస్త్రేలియాకు చెందిన టోని అన్నెలుగెట్ మృతదేహం లభించింది.
వాచ్ మెన్ భగవంతుడు టోనిని హత్య చేశాడని, ఈకేసులో ఆతనే కీలక పాత్ర పోషించాడని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడించారు. భగవంతుడికి నాగరాజు, పోతులయ్య సహకరించారని రాజశేఖరబాబు తెలిపారు. ఈ కేసులో పుట్టపర్తి సాయి గౌరి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భగవంతుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement