puttaparti
-
‘ఫ్యామిలీ డాక్టర్’తో మెరుగైన వైద్య సేవలు
హిందూపురం: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటివద్దే మెరుగైన వైద్య సేవలందుతాయని కలెక్టర్ బసంత్‌కుమార్ అన్నారు. విలేజ్ క్లినిక్‌లో ఓ డాక్టర్, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, వలంటీర్లు ఉంటారని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని గోళాపురం గ్రామంలో నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్‌ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న గర్భిణితో పౌష్టికాహారం, పాలు, గుడ్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తూమకుంట పారిశ్రామికవాడలోని విప్రో, ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు, తయారయ్యే ఉత్పత్తులు, ఫ్యాక్టరీలో వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కారి్మకుల స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వేత్తలు సమీపంలోని గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక బాధ్యత కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఫ్యామిలీ డాక్టర్‌తో సంపూర్ణ రక్షణ పుట్టపర్తి అర్బన్: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. స్థానిక పాఠశాల వద్ద ఓపీ నిర్వహించగా, మధ్యాహ్నం వరకూ గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి జ్వరం, దగ్గు, జలుబు, నొప్పులు వంటి వాటికి మందులు తీసుకున్నారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని, గర్భిణులు, బాలింతల ఇళ్లకే వెళ్లి వైద్యలు పరీక్షించి మందులు ఇచ్చారు. కొందరిని మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి, నిరుపేదలకు ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి నెలా వైద్య బృందం గ్రామానికి విచ్చేసి రోజంతా గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి లక్ష్మానాయక్, పుట్టపర్తి వైద్యాధికారి నాగరాజు నాయక్, సీహెచ్ఓ నగేష్, రమణయ్య, సూపర్వైజర్లు చంద్రకళ, రమణ, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ... ఒకరి మృతి ) -
సత్యసాయి సమాధిని దర్శించుకున్న గవర్నర్
సాక్షి, పుట్టపుర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ అశోక్ కుమార్, ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సాయి దర్శనం అనంతరం ట్రస్ట్ సేవల గురించి ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. అనంతరం నరసింహన్ బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. -
పుట్టపర్తిలో ప్రపంచ వేద సమ్మేళనం
సాక్షి, అనంతపురం: పుట్టపర్తిలో సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ వేద సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేద పండితులు, దేశవిదేశాల నుంచి సత్య సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. వేదాలపై పరిశోధనలు జరిపి ప్రజలను పీడిస్తున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించవచ్చనే దానిపై కూలంకషంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల మంది సత్యసాయి శిష్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో ఉన్న 600 మంది ప్రియ శిష్యులు సామూహిక వేద పారాయణం చేయనున్నారు. రెండవ రోజు రుద్ర తత్వం-ఏకత్వం అనే నాటికను తమిళనాడుకు చెందిన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. -
వీడిన హత్య కేసు మిస్టరీ
పుట్టపర్తి టౌన్: జార్ఖండ్‌కు చెందిన జేసీబీ డ్రైవర్ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతుడి సమీప బంధువులైన ఇద్దరు ఈ కేసులో నిందితులు. వీరిని సోమవారం అరెస్ట్ చేశారు. పుట్టపర్తి డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి తెలిపిన మేరకు.. సెప్టెంబర్ 25న పుట్టపర్తి సమీపాన హంద్రీ–నీవా కాలువ గట్టున గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు హంద్రీనీవా కాలువ పనులకు సంబంధించిన జేసీబీ డ్రైవర్ అయిన జార్ఖండ్ రాష్ట్రానికి చెంది తులసీఠాకూర్గా పోలీసుల విచారణలో తేలింది. ఆస్తి కోసమే సమీప బంధువు మనోజ్ ఠాకూర్, సుధీర్శర్మలు తులసీ ఠాకూర్‌ను బండరాయితో మోది హత్య చేసి పరారైనట్లు తెలిసింది. దీంతో వారి స్వస్థలాలకు వెళ్లి నిందితులను పట్టుకుని పుట్టపర్తికి తీసుకువచ్చారు. కేసును ఛేదించిన సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్ఐ వెంకటేష్ నాయక్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు అనురాధ కృష్ణమూర్తి నిర్వహించిన సంగీత కచేరిభక్తులను అలరించింది. సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత అనురాధ కృష్ణమూర్తి బృందం సంగీత కచేరి నిర్వహించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతుల్లో సుమధుర సంగీత స్వరాలొకిస్తూ ఆమె నిర్వహించిన సంగీత కచేరితో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. సత్యసాయిని, సర్వదేవతలను కీర్తిస్తూ ఆమె సంగీత కచేరి నిర్వహించారు. అనంతరం కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వారిని సత్యసాయి ట్రస్టు సభ్యులు సన్మానించారు. -
సత్యసాయి సేవలు ఆదర్శం
పుట్టపర్తి టౌన్ : మానవాళికి ప్రేమతత్వాన్ని పంచుతూ లోక కల్యాణ సాధనకు పాటుడిన మహనీయుడు సత్యసాయి అని, ఆయన సేవలు ప్రపంచానికి ఆదర్శమని కేరళ రాష్ట్ర హైకోర్ట్ జడ్జి అను శివరామన్ పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన రెండో రోజు వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. కేరళీయులు ప్రాచీన కాలం నుంచి ఓనం వేడుకలను ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నారన్నారు. చెడును సంహరించడం మంచిని పెంచడమే ఓనం పర్వదిన సందేశమన్నారు. అనంతరం కేరళలోని కోజీకోడ్ జిల్లాకు చెందిన సద్గురుకులానికి చెందిన సంగీత విద్వాంసులు సనల్‌కుమార్ వర్మ,సుభాష్ చంద్రన్,జైరాజాలు కేరళ సంప్రదాయ రీతిలో సంప్రధానభజన్ కచేరి నిర్వహించారు. కచేరీలో భాగంగా గురువాయూర్ కృష్ణ, ఆదిదేవత అయిన కోల్లూరు ముఖాంభికా, గణేష్, సుబ్రహ్మణ్యంస్వామి,శభరిమల ఆయ్యప్పలను కీర్తిస్తూ భక్తి›గీతాలు అలపించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
రోడ్డుపై ఊసరవెల్లి
ప్రమాదకరమైన ఊసరవెల్లి రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కప్పలబండ వద్ద ప్రధాన రోడ్డుపై ఊసరవెల్లి కనిపించింది. దాన్ని చంపడానికి కొందరు ప్రయత్నించగా పలు రంగులు మారుస్తూ పొదల్లోకి వెళ్లిపోయింది. -
అడ్డొస్తున్నాడని అంతమొందించారు
ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య పోలీసుల విచారణలో అంగీకరించిన నిందితురాలు విషయం తెలిసి ప్రియుడ్ని చెట్టుకు కట్టేసిన తండావాసులు ఆపై పోలీసులకు పట్టిచ్చిన వైనం భర్త ఉండగానే ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శాశ్వతంగా అతని అడ్డు తొలగించుకుంటే తమకు ప్రశ్నించే వారే ఉండరనుకున్న ఆమె ప్రియుడితో కలసి పథకం రచించింది. వారిద్దరూ కలసి మరో ఇద్దరి సహకారంతో అమాయకుడ్ని చంపేశారు. ఆ తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైనా.. చివరకు పోలీసులకు ఆమె దొరికిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ప్రియుడ్ని తండావాసులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఎస్ఐ వజ్రముని కథనం ప్రకారం... జరిగిందేమిటంటే... పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్దతండాకు చెందిన కె.యుగంధర్(28), మంజుల దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి నాలుగేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ అదే తండాకు చెందిన ఆంజనేయులు నాయక్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం యుగంధర్‌కు తెలిసి భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన అతను ఇక ఆమెను ఏమీ అనలేకపోయాడు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆమె భర్త అడ్డు తొలగించుకుంటే శాశ్వతంగా తాము మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని భావించారు. ఇదే విషయం ఆమె ప్రియుడితో చెప్పింది. తమ పథకాన్ని మరో ఇద్దరికి తెలిపి వారి సహకారంతో రెండ్రోజుల కి ందట యుగంధర్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. ఆ తరువాత మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టేసి ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో పడేశారు. హతుడి భార్య మంజులను శనివారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, ఆంజనేయులు నాయక్ సహా మరో ఇద్దరితో కలసి హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసుల సమాచారంతో... విచారణలో భాగంగా ఆంజనేయులు నాయక్ ఆచూకీ తెలుసుకునే క్రమంలో పోలీసులు పెడబల్లి తండా వాసులకు ఫోన్ చేసి ఆంజనేయులు నాయక్ చేసిన ఘనకార్యం గురించి వివరించారు. ఈ విషయం క్షణాల్లో తండా యావత్తూ తెలిసిపోవడంతో ఊరంతా ఒక్కటై నిందితుడు ఆంజనేయులు నాయక్ పరారు కాకుండా, అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆ తరువాత కర్ణాటక పోలీసులు రాగానే వారికి పట్టిచ్చారు. వందలాది మంది గ్రామస్తులు చుట్టుముట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. -
రష్యా దేశస్తుడి వీరంగం!
అనంతపురం: పుట్టపర్తి సమీంపలో రష్యా దేశస్తుడు వీరంగం చేశాడు. రష్యా దేశానికి చెందిన డిమిత్రీ కొత్తచెరువు మండలం కొడవగానిపల్లి గ్రామంలో సుమోను అతి వేగంగా నడిపాడు. గ్రామంలో సత్యసాయి ముఖద్వారాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డిమిత్రీ గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వేడుకగా సత్యసాయి జయంత్యుత్సవాలు
పుట్టపర్తి: పుట్టపర్తి సత్యసాయి బాబా 89వ జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణోత్సవం, వేణుగోపాలస్వామికి పూజలు నిర్వహించారు. తర్వాత ప్రశాంతి నిలయం ఉత్తరగోపురం వద్ద నుంచివేణుగోపాలస్వామి రథోత్సవాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, మద్రాస్ శ్రీనివాస్ ప్రారంభించారు. సీతారామ, లక్ష్మణ, హనుమంతులు ముందు ఊరేగగా.. ఆ వెనుకే వేణుగోపాలుడి రథం పురవీధుల గుండా తిరిగింది. అనంతరం రత్నాకర్ రాజు విలేకరులతో మాట్లాడుతూ..89వ జయంతి కానుకగా పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోని 118 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 80 కోట్లతో పూర్తిచేసిన పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ప్రారంభిస్తారన్నారు. సత్యసాయి జీవిత విశేషాలను తెలియజేసే ఆర్కియాలజీ భవన్‌ను వచ్చే సత్యసాయి ఆరాధనోత్సవాల నాటికి ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారుు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్‌రావు, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు ఈ నెల 23వరకూ జరుగుతాయి. -
ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత
-
ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత
అనంతపురం : పుట్టపర్తిలో హత్యకు గురైన ఆస్ట్రేలియన్ మహిళ టోనీ అన్నేల్ గేట్ మృతదేహానికి శవ పరీక్ష పూర్తియింది. టోనీ అస్తిపంజరం నుంచి బంగారు చైన్‌తో పాటు రెండు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మృతదేహానికి డీఎన్ఏతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. వాటిని బెంగళూరుకు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్మెంట్లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్కు సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. సాయిగౌరీ అపార్ట్మెంట్ వాచ్మెన్, మరొకరితో కలిసి టోనీని డబ్బుకోసం హతమార్చారు. -
పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ హత్య
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ టోనీ అన్నెల్ గేట్(75) దారుణ హత్యకు గురైంది. పోలీసుల సమాచారం మేరకు... సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది. ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్మెంట్లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆమెకు ఇక్కడే ఉంటున్న గ్రైట్ డీ సుట్టర్ అనే మరో విదేశీ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్కు సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న టోనీ కుమార్తె, కుమారులకు సమాచారం అందించింది. టోనీ కుమార్తె వెంటనే ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేసింది. సాయిగౌరీ ఆపార్ట్మెంట్ వాచ్మెన్ భగవంతుడిని పోలీసులు విచారించారు. డబ్బు కోసం ఆగస్టు 29న ఉదయం 11.30 గంటలకు ఎదుటి అపార్ట్మెంట్ వాచ్‌మన్ పోతులయ్య సహకారంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోతులయ్య, తన బావమరిది నాగరాజు సహకారంతో టోనీ మృతదేహాన్నిసుమో వాహనంలో కొత్తచెరువు మండలంలోని తన స్వగ్రామమైన తలమర్ల సమీపంలోని ఈతచెట్ల వనం వద్దకు తరలించి పూడ్చిపెట్టారు. శుక్రవారం రాత్రి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. -
పుట్టపర్తిలో విదేశీ మహిళ మృతదేహం లభ్యం
అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తిలో అదృశ్యమైన విదేశీ మహిళ హత్య కేసులో పురోగతి కనిపించింది. కొత్త చెరువు మండలం మంకుంటపల్లి వద్ద ఆస్త్రేలియాకు చెందిన టోని అన్నెలుగెట్ మృతదేహం లభించింది. వాచ్ మెన్ భగవంతుడు టోనిని హత్య చేశాడని, ఈకేసులో ఆతనే కీలక పాత్ర పోషించాడని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడించారు. భగవంతుడికి నాగరాజు, పోతులయ్య సహకరించారని రాజశేఖరబాబు తెలిపారు. ఈ కేసులో పుట్టపర్తి సాయి గౌరి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భగవంతుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
వీడిన విదేశీ మహిళ అదృశ్యం కేసు!
అనంతపురం: పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యం కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో పుట్టపర్తి సాయి గౌరి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భగవంత్ తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత జూలైలో టోని అన్నెలుగెట్ భారత్ కు వచ్చింది. ఆతర్వాత సెప్టెంబర్ లో టోని అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో గత కొద్ది వారాలుగు బెంగళూరు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. డబ్బు, నగల కోసమే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. టోని మృతదేహం కోసం కొత్త చెరువు పరిసరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. -
పుట్టపర్తిలో కేరళ వాసి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్: కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన చేతి నరాలను కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుట్టపర్తిలో మంగళవారం చోటు చేసుకుంది. పుట్టపర్తి పట్టణ సీఐ వేణుగోపాల్, మృతుని మేనమామ శశికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా షోర్నూర్‌కు చెందిన ఉన్నికృష్ణన్ (32) దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కొంతకాలం క్రితం కేరళకు తిరిగి వచ్చిన ఆయన, ఈ నెల 9న పుట్టపర్తికి వచ్చాడు. ఉన్నికృష్ణన్ మేనమామ శశికుమార్ ఐదు నెలల కిందట పుట్టపర్తికి వచ్చి చిత్రావతి గుట్ట వద్ద చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటూ.. ప్రశాంతి నిలయంలో భక్తులకు సేవ చేస్తున్నాడు. పది రోజుల పాటు మేనమామ గదిలోనే ఉన్న ఉన్నికృష్ణన్ అనంతరం 19వ తేదీ రాత్రి చిత్రావతి రోడ్డులోని జయసాయి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని అందులోకి మారాడు. సోమవారం రాత్రి మేనమామతో కలసి ప్రశాంతి నిలయానికి వెళ్లి వచ్చాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ లాడ్జి గది నుంచి బయటికి రాకపోవడంతో శశికుమార్.. ఉన్నికృష్ణన్ గదికి వెళ్లి పరిశీలించాడు. చేతి నరాలు కోసుకోవడంతో తీవ్ర రక్త స్రావమై.. మంచంపైనే విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే శశికుమార్ పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య సుచిత్ర, 18 నెలల వయసున్న కుమారుడు నిరంజన్ వారి స్వస్థలమైన షోర్నూర్‌లో ఉంటున్నారు. కాగా, ఉన్నికృష్ణన్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
-
ప్రమాదాలపై కమిషన్లే తప్ప ఫలితంలేదు:జగన్
పుట్టపర్తి: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేస్తున్నారు గానీ, ఫలితం ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత బి ఒన్ ఏసి కోచ్లోమంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జగన్ కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విచారణకు కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మళ్లీ మళ్లీ మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. విచారణ నివేదికలు లేవు. ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదు. వివరాలు వెల్లడించరు. మళ్లీ ఈరోజు కూడా కమిషన్ వేస్తామంటారు. పలాన సమస్య వల్ల ఇంతమంది చనిపోయారు అని తెలియజేయరు. మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదు. పాత బోగీలు వాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓల్వో బస్సు ప్రమాదాలు నాలుగు జరిగాయి. నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సు లు దగ్ధమయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా కారణాలు తెలియజేయడంలేదు. ఈ రకంగా ఇంతమంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి రక్షణ కల్పించాలని, భరోసా ఇవ్వాలని కోరారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్స్‌గ్రేషియా ఎంత ఇచ్చారనేది కాదన్నారు. 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. ఎక్స్‌గ్రేషియా 5 లక్షలలా, పది లక్షలా, 20 లక్షలా అనేది కాదని, ప్రజలకు భద్రత కల్పించమని కోరుతున్నామని చెప్పారు. -
నేడు సత్యసాయి 88వ జయంతి
-
నేడు సత్యసాయి 88వ జయంతి
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఆయన 88వ జయంతి వేడుకలను వైభవంగా చేసేందుకు సత్యసాయి ట్రస్టు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. 1926 నవంబర్ 23వ తేదీన జన్మించిన సత్య సాయిబాబా, 2011 ఏప్రిల్ 24వ తేదీన పరమపదించిన విషయం తెలిసిందే. సత్యసాయి జయంతి సందర్భంగా ఆయన పేరు మీద రూ. 5 విలువైన పోస్టల్ స్టాంపును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి పుట్టపర్తిలో విడుదల చేయనున్నారు. అలాగే, 80 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి పథకాన్ని కూడా సత్యసాయి ట్రస్టు ప్రారంభించనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.