వీడిన విదేశీ మహిళ అదృశ్యం కేసు!
Published Fri, Nov 7 2014 8:35 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
అనంతపురం: పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యం కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో పుట్టపర్తి సాయి గౌరి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భగవంత్ తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గత జూలైలో టోని అన్నెలుగెట్ భారత్ కు వచ్చింది. ఆతర్వాత సెప్టెంబర్ లో టోని అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో గత కొద్ది వారాలుగు బెంగళూరు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు.
డబ్బు, నగల కోసమే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. టోని మృతదేహం కోసం కొత్త చెరువు పరిసరాల్లో పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Advertisement