తమ్ముడిని పెళ్లి చేసుకోమని.. ప్రియురాలి వద్దకు
తమ్ముడిని పెళ్లి చేసుకోమని.. ప్రియురాలి వద్దకు
Published Wed, Feb 1 2017 3:03 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
అనంతపురం: ఒక్క రోజులో పెళ్లి.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ఇరువైపు బంధువులు వచ్చారు.. ఇంతలో తాను ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చిన పెళ్లికొడుకు.. ఆమెనే పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి కుమార్తెకు ఓ లేఖ రాసి ఉన్నట్టుండి పరారయ్యాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన అనంతపురంలోని సిండికేట్ నగర్‌లో జరిగింది. చరణ్ అనే యువకుడు రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
కానీ వారి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకుండా మరో సంబంధం చూశారు. గురువారం పెళ్లి జరగాల్సిఉంది. ముందస్తుగా రూ. 5 లక్షల కట్నం కూడా పుచ్చుకున్నాడు. గంటల్లో పెళ్లి ఉందనగా తీరా ప్రేమించిన అమ్మాయి దగ్గరకు వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి మరీ ఉడాయించాడు చరణ్. పైగా పెళ్లి కూతురుకు మరో సూచన కూడా చేశాడు. పెళ్లి ఆగిపోకుండా తన తమ్ముడు హరిని పెళ్లి చేసుకోవాలని అందులో రాశాడు. పెళ్లి కొడుకు వెళ్లిపోవడం, పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement