రాత్రికి పెళ్లి.. పెళ్లికొడుకు అదృశ్యం | Bridegroom Missing in hyderabad | Sakshi
Sakshi News home page

రాత్రికి పెళ్లి.. పెళ్లికొడుకు అదృశ్యం

Published Sat, Sep 12 2015 11:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

రాత్రికి పెళ్లి.. పెళ్లికొడుకు అదృశ్యం

రాత్రికి పెళ్లి.. పెళ్లికొడుకు అదృశ్యం

హైదరాబాద్ :  రాత్రి పెళ్లి...ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. ఉదయం నుంచి పెళ్లికొడుకు కనిపించుకుండా పోయాడు. దీంతో వరుడు, వధువు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాష తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ మహ్మదీ లైన్స్ శాతంగనగర్కు చెందిన రహీం అహ్మద్ ఖాన్ స్టోన్ పాలిష్ వర్కర్.

ఈ నెల 10వ తేదీ సాయంత్రం టోలీచౌకికి చెందిన యువతితో ఇతనికి నిఖా జరగాల్సి ఉంది. కాగా గురువారం ఉదయం రహీం అహ్మద్ ఖాన్ తాను పని చేసే సైట్కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బైక్పై వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విఛ్ఛాప్ వచ్చింది. సాయంత్రం అయినా రహీం తిరిగి రాకపోవటంతో ఇరు కుటుంబాల వారు రహీం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ దొరకక పోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement