సాక్షి, అనంతపురం: పుట్టపర్తిలో సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ వేద సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేద పండితులు, దేశవిదేశాల నుంచి సత్య సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు.
వేదాలపై పరిశోధనలు జరిపి ప్రజలను పీడిస్తున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించవచ్చనే దానిపై కూలంకషంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల మంది సత్యసాయి శిష్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో ఉన్న 600 మంది ప్రియ శిష్యులు సామూహిక వేద పారాయణం చేయనున్నారు. రెండవ రోజు రుద్ర తత్వం-ఏకత్వం అనే నాటికను తమిళనాడుకు చెందిన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment