
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం నుంచి సాయికుల్వంత్ మందిరంలో భజనలు, సంగీత కచేరీ, వేద పఠనం పూర్తిగా నిలిపేస్తున్నట్టు చెప్పారు. అయితే మంగళహారతి అనంతరం ఉదయం 9.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటల తర్వాత భౌతిక దూరం పాటిస్తూ క్యూలో వెళ్లి మహాసమాధిని దర్శించుకుని బయటకు వెళ్లిపోవాలని తెలిపారు. భక్తులంతా విధిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని రత్నాకర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment