Puttaparthi Prasanthi Nilayam
-
మహా సమాధి దర్శనానికే భక్తులకు అనుమతి
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం నుంచి సాయికుల్వంత్ మందిరంలో భజనలు, సంగీత కచేరీ, వేద పఠనం పూర్తిగా నిలిపేస్తున్నట్టు చెప్పారు. అయితే మంగళహారతి అనంతరం ఉదయం 9.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటల తర్వాత భౌతిక దూరం పాటిస్తూ క్యూలో వెళ్లి మహాసమాధిని దర్శించుకుని బయటకు వెళ్లిపోవాలని తెలిపారు. భక్తులంతా విధిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని రత్నాకర్ సూచించారు. -
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహేంద్రుడు
-
సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోని
-
సత్యసాయి సమాధిని దర్శించుకున్న ధోని
సాక్షి, అనంతపురం : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోని మంగళవారం పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికారు. ధోని పర్సనల్ డాక్టర్ ముత్తు.. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ ముత్తు కోసం ధోని పుట్టపర్తి వచ్చి పుట్టపర్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాను ట్రస్ట్ సభ్యులు వివరించారు. పర్సనల్ డాక్టర్ పుట్టపర్తిలో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం పుట్టపర్తికి వచ్చారని కెప్టెన్ కూల్ వెల్లడించారు. అనంతరం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ధోనిని ఘనంగా సన్మానించారు. -
ప్రశాంతి నిలయంలో అగ్ని ప్రమాదం
పుట్టపర్తి, న్యూస్‌లైన్: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో ఉన్న స్టోర్ గదిలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సత్యసాయి వేడుకల సందర్భంగా అలంకరణకు ఉపయోగించిన సామగ్రిని నిల్వచేసిన గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్లాస్టిక్ సామగ్రికి నిప్పంటుకుంది. సేవాదళ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధి : శాం పిట్రోడా
పుట్టపర్తి, న్యూస్‌లైన్: నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు యువత కృషి చేయాలని ప్రధాన మంత్రి సలహాదారు శాం పిట్రోడా పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో శుక్రవారం జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భారత్ నేడు ఎంతో అభివృద్ధి చెందిందని, అన్ని రంగాల్లోనూ అగ్రదేశాలతో పోటీ పడుతోందని చెప్పారు. బయోటెక్, ఆటమిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఎంతో వేగంగా దూసుకుపోతోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని తెలిపారు. అయితే, మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఇంకా అనేకం ఉన్నాయని వివరించారు. ప్రతి వ్యక్తి స్వీయ పరివర్తన ద్వారా అభివృద్ధి మార్గంలో నడవాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, కష్టపడేతత్వాన్ని పెంపొందించేలా విద్యావిధానాన్ని కొనసాగించడం సత్యసాయి విద్యాసంస్థలకే సాధ్యమన్న విషయాన్ని తాను గ్రహించానని శాం పిట్రోడా అన్నారు. సవాళ్లను అధిగమించడంలో విద్యా సంస్థల పాత్ర కీలకం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన విద్యనందించే గొప్ప విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పారని కొనియాడారు. సమాజాభివృద్ధికి దోహదపడే అనేక ప్రయోగాలు నేడు విద్యాలయాల్లోనే కొనసాగుతున్నాయని చెప్పారు. పుట్టపర్తిలోని సత్యసాయి విద్యాసంస్థలు అటువంటి ప్రయోగశాలలుగా వెలుగొందుతున్నాయన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన 25 మంది విద్యార్థులకు వెంకటాచలయ్య బంగారు పతకాలు ప్రదానం చేశారు.