satya sai baba
-
పుట్టపర్తి వైభవం.. ఖండాంతరం!
పుట్టపర్తి అర్బన్: నాలుగు దశాబ్దాల క్రితం పది పూరి గుడిసెలతో ఉన్న కుగ్రామం నేడు బహుళ అంతస్తులకు కేంద్రీకృతమైంది. ఒకప్పడు రోడ్డు పక్కన కర్ణాటకలోని బాగేపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు కోసం గంటల తరబడి వేచి చూసిన జనం.. నేడు కేవలం గంటల వ్యవధిలోనే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా విమానంలో చేరుకునేలా ఏర్పాటైన విమానాశ్రయాన్ని చూస్తున్నారు. కుగ్రామం నుంచి జిల్లా కేంద్రంగా ఎదిగిన పుట్టపర్తి ప్రస్థానంపై సత్యసాయి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి.. పుట్టపర్తి ఆవిర్భావం వెనుక పురాణ కథను స్థానికులు నేటికీ గుర్తు చేస్తుంటారు. ‘కులాలు, వర్ణాల వారీగా కమ్మవారిపల్లి, బ్రాహ్మణపల్లి, కర్ణాటక నుంచి వచ్చి చిత్రావతి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతంలో పది ఇళ్లు మాత్రమే ఉండేవి. గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి గొల్లపల్లి అని పిలుచుకునేవారు. జీవనం కోసం ఎక్కువగా గోవులను పెంచేవారు. ఓ ఆవు పాలు ఇవ్వకుండా మొరాయిస్తుండడంతో దాని యజమాని నిఘా ఉంచాడు. ఓ మధ్యాహ్న సమయంలో ఆవు పుట్ట వద్దకెళ్లి నిల్చోన్నప్పుడు పొదుగు నుంచి పాలు పుట్టలోకి ధారాపాతంగా కారుతుండడం గమనించాడు. ఇది గమనించిన యజమాని బండరాయితో ఆవును కొట్టబోగా అది తప్పించుకుంది. అదే సమయంలో పుట్టలోని నుంచి వెలుపలకు వచ్చిన పాముకు బండరాయి తగిలి చనిపోతూ గొల్లపల్లి పుట్టల మయంగా మారుతుందని, పాడి పశువులు కనుమరుగవుతాయని శపించింది. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు శాప విమోచనం కోసం పుట్ట ఉన్న ప్రాంతంలో పూజలు నిర్వహించి వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు’. అలా గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా రూపాంతరం చెందింది. సత్యసాయి ఆవిర్భావంతో మహర్దశ.. గొల్లపల్లిలో 1926 నవంబర్ 23వ తేదీన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ.. 1940 అక్టోబర్లో అవతార ప్రకటనతో సత్యసాయిగా మారారు. ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం 1948లో ప్రశాంతి నిలయానికి సత్యసాయి శంకుస్థాపన చేశారు. 1950 నవంబర్ 23 నాటికి ప్రశాంతి నిలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అక్కడే పూర్ణచంద్ర ఆడిటోరియం నిర్మించి అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. సత్యసాయిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులు మారాయి. వచ్చే భక్తులకు విడిది, ఇతర సౌకర్యాల కల్పనలో భాగంగా గ్రామ పరిధి విస్తరించింది. దీంతో 1964లో పంచాయతీగా పుట్టపర్తి మారింది. అనంతరం పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలను కలుపుతూ 1980 నవంబర్లో సత్యసాయి తాలూకాను ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధి కోసం 1981లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించారు. 1984లో నిర్మాణ పనులు చేపట్టి 1991లో అన్ని రకాల సదుపాయాలతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1990లో ఆర్టీసీ బస్టాండ్, 1991 నవంబర్లో సత్యసాయి విమానాశ్రయం, 2000 నవంబర్లో ప్రశాంతినిలయం రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. 1995 జూలైలో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అప్పట్లో 771 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేశారు. 1995 జూలైలో సాయికుల్వంత్ మంటపాన్ని నిర్మించారు. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పంచాయతీని 1980లో సమితిగాను, 2006 ఆగస్టులో మేజర్ పంచాయతీగా, 2011 ఆగస్టులో నగర పంచాయతీగా, 1991లో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్(పుడా)గా అనంతరం 2009లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. (చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష) -
మహా సమాధి దర్శనానికే భక్తులకు అనుమతి
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా గురువారం నుంచి సాయికుల్వంత్ మందిరంలో భజనలు, సంగీత కచేరీ, వేద పఠనం పూర్తిగా నిలిపేస్తున్నట్టు చెప్పారు. అయితే మంగళహారతి అనంతరం ఉదయం 9.30 గంటలకు, సాయంత్రం 6.30 గంటల తర్వాత భౌతిక దూరం పాటిస్తూ క్యూలో వెళ్లి మహాసమాధిని దర్శించుకుని బయటకు వెళ్లిపోవాలని తెలిపారు. భక్తులంతా విధిగా మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని రత్నాకర్ సూచించారు. -
సత్యసాయి సమాధిని దర్శించుకున్న గవర్నర్
సాక్షి, పుట్టపుర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ అశోక్ కుమార్, ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. సాయి దర్శనం అనంతరం ట్రస్ట్ సేవల గురించి ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. అనంతరం నరసింహన్ బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. -
సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత బాబాదే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మన రొట్టె మనమే తినడం ప్రకృతి, పక్కవాని నుంచి దొంగిలించి తినడం వికృతి, మన రొట్టెను పక్కనున్న వానికి పెట్టడం సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతిలోని గొప్పదనం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత సత్యసాయి బాబాది’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. బాబా సమాధికి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, భక్తులనుద్దేశించి ప్రసంగించారు. తాను మొదట అద్వానీతో కలిసి పుట్టపర్తికి వచ్చానని, అద్వానీ నన్ను పరిచయం చేయబోతే బాబా.. ‘వెంకయ్యనాయుడు నాకు తెలుసు. ఆరోగ్యం ఎలా ఉంది?’ అని అడిగారని గుర్తు చేశారు. నిజానికి నాకు ఆరోగ్యం బాగాలేని సంగతి బాబాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయానన్నారు. ‘గాడ్బ్లెస్ యూ’ అని దీవించారన్నారు. భారతీయ పురాణాలు, సంస్కృతి, చరిత్ర ‘మానవ సేవే మాధవ సేవ’ అని చెబుతుందని, దాన్ని బాబా ఆచరించి ప్రపంచాన్ని మొత్తం చైతన్యం చేశారన్నారు. ఈ రోజు బాబా చూపిన మార్గంలో సత్యసాయి ట్రస్టు పయనిస్తోందన్నారు. మంచినీరు, విద్య, వైద్యసేవల్లో ట్రస్టు సేవలు ఎనలేనివని కొనియాడారు. బాబాను పూజించడమంటే చిత్రపటాలకు పూలమాల వేయడం, నమస్కరించడం కాదని.. బాబా చూపిన సేవామార్గంలో నడిచినప్పుడే ఆయన్ను పూజించినట్లని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమ, సేవ రెండూ ఉంటే శాంతి ఉంటుందన్నారు. ‘సర్వధర్మ సమభావన’ అనేది పుట్టపర్తిలో ఉందని, ఇది విశ్వవ్యాప్తంగా కావాలని కాంక్షించారు. కొంతమంది రాజకీయ నేతలు సెక్యులరిజమ్ అని గొప్పగా చెబుతుంటారని, భారతదేశంలోని ప్రతి ఒక్కరి డీఎన్ఏలో సెక్యులరిజమ్ ఉంటుందన్నారు. భావితరాలకు సత్యసాయి బోధనలు.. సత్యసాయి అవతార విశేషాలు, బోధనలు, సందేశాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సత్యసాయి ఆర్కీవ్స్ భవనాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. -
పుట్టపర్తిలో ప్రపంచ వేద సమ్మేళనం
సాక్షి, అనంతపురం: పుట్టపర్తిలో సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ వేద సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేద పండితులు, దేశవిదేశాల నుంచి సత్య సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. వేదాలపై పరిశోధనలు జరిపి ప్రజలను పీడిస్తున్న సమస్యలను ఏవిధంగా పరిష్కరించవచ్చనే దానిపై కూలంకషంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల మంది సత్యసాయి శిష్యులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో ఉన్న 600 మంది ప్రియ శిష్యులు సామూహిక వేద పారాయణం చేయనున్నారు. రెండవ రోజు రుద్ర తత్వం-ఏకత్వం అనే నాటికను తమిళనాడుకు చెందిన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. -
వేడుకగా సత్యసాయి జయంతోత్సవాలు
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు శనివారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 గంటల సమయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, ప్రసాదరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్పాండే, రాష్ట్ర అధ్యక్షుడు చలం తదితరులు ప్రశాంతి నిలయం ఉత్తర ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. దారి వెంట సాయి నామస్మరణతో పుట్టపర్తి హోరెత్తింది. అంతకు ముందు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అక్కడే సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించి ఊరేగించారు. కాగా, ప్రశాంతి నిలయం నార్త్ బ్లాక్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 55 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం 25వ తేదీ వరకు కొనసాగుతుందని సత్యసాయి ఐడిల్ హెల్త్కేర్ చైర్మన్ నరేంద్రనాథ్రెడ్డి తెలిపారు. 20, 21 తేదీల్లో అంతర్జాతీయ వేద సమావేశం దేశంలో తొలిసారిగా పుట్టపర్తిలో నిర్వహణ సాక్షి, అమరావతి: ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి వేదాల్లో సూచించిన పరిష్కారాలపై రెండు రోజుల అంతర్జాతీయ వేద సమావేశాలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదిక కానుంది. ఈనెల 20, 21 తేదీల్లో జరిగే ఈ అంతర్జాతీయ వేద సమావేశంలో వేద పండితులతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నట్లు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (ఇండియా) అధ్యక్షుడు నిమీష్ పాండే తెలిపారు. సత్యసాయి బాబా 92వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వేదాలపై పరిశోధన చేసి వేద పండితులు ప్రస్తుత సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో చర్చించనున్నట్లు తెలిపారు. మంచి నీటి ఎద్దడి, వ్యవసాయం, వాతావరణం, ఆహార కొరత వంటి సమస్యలకు వేదాల్లో పరిష్కారాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. 1,500 మందికిపైగా సత్యసాయి శిష్యులతో పాటు 42 దేశాలకు చెందిన 600 మంది సామూహిక వేదపారాయణంలో పాల్గొననున్నారు. -
18 నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
పుట్టపర్తి అర్బన్: ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి వేడుకలు ఈ నెల 18 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ 18న పట్టణంలో నిర్వహించే వేణుగోపాలస్వామి రథోత్సవంతో బాబా జయంతి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 18, 19 తేదీల్లో జాతీయ యువజన సమ్మేళన సదస్సులు స్థానిక సత్సంగ్ హాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. 20, 21 తేదీల్లో అంతర్జాతీయ వేద సదస్సు స్థానిక పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉంటుందని తెలిపారు. సదస్సులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారన్నారు. 22న సత్యసాయి విశ్వ విద్యాలయ 36వ స్నాతకోత్సవం స్థానిక సాయికుల్వంత్ హాల్లో ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా లండన్లోని షీఫెల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆం«థోని ఆర్ వెస్ట్ హాజరు కానున్నట్లు చెప్పారు. అదే రోజు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారన్నారు. అదే రోజు స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని వినిపిస్తారని తెలిపారు. 23న సత్యసాయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. -
సత్యసాయిగా నేను మళ్లీ జన్మించాను!
సత్య సాయిబాబా మళ్లీ భూమ్మీద అవతరించారా? అవునని.. ఆ అవతారం తానేనని బెంగళూరు సమీపంలోని ముద్దెనహళ్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెబుతున్నాడు. సాయిబాబా 90వ జయంతి అయిన నవంబర్ 24న భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలని భక్తులు భావిస్తున్న తరుణంలో ఈ పునర్జన్మ వాదన వెలుగులోకి రావడం విశేషం. సత్యసాయి మరణించడానికి ముందు తన వారసుడిగా ఎవరినీ ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ముద్దెనహళ్లికి చెందిన మధుసూదన్ నాయుడు మాత్రం.. తానే సాయి వారసుడినని చెబుతున్నాడు. సాయిబాబా రోజూ తనకు కలలోకి వస్తారని, తానేం చేయాలో అన్నీ ఆయనే చెబుతారని కూడా అంటున్నాడు. జయంతి వేడుకలు భారీగా చేయాలని కూడా తనకు బాబాయే చెప్పారంటున్నాడు. అయితే, పుట్టపర్తిలోని సత్య సాయిబాబా ట్రస్టు సభ్యులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. సాయిబాబా పునర్జన్మ ఎత్తలేదని, మధుసూదన్ నాయుడు ఆయన వారసుడు కానేకాడని అంటున్నారు. పుట్టపర్తి ప్రాధాన్యాన్ని, పవిత్రతను మంటగలిపేందుకు కర్ణాటకలోని కొందరు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. సాయిబాబా 2011లో మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి నుంచి పుట్టపర్తికి భక్తుల రాక గణనీయంగా తగ్గింది. అంతకుముందు 25-30వేల మంది విదేశీ భక్తులు, లక్షలాది మంది భారతీయులు రోజూ ఆశ్రమానికి వచ్చేవారు. ఇప్పుడు విదేశీయుల సంఖ్య 3-4వేలకు, భారతీయుల సంఖ్య కూడా వేలలోకి పడిపోయింది. ట్రస్టుకు బ్యాంకులలో రూ. 1500 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వాటిమీద వడ్డీయే ఏడాదికి రూ. 120 కోట్లు వస్తుందని చెబుతున్నారు. ఏడాదికి దాదాపు రూ. 60 కోట్ల వరకు విరాళాలు కూడా వస్తుంటాయి. అందుకే ఈ ఆశ్రమం మీద ఆధిపత్యం కోసం తరచు ప్రయత్నాలు జరుగుతుంటాయి. -
ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ఈ ఉత్సవాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరయ్యారు. సాయి నామస్మరణతో సభామందిరం మార్మోగింది. ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేద మంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ ‘పంచరత్నకీరి’్త పేరుతో భక్తిగీతాలు ఆలపించారు. సత్యసాయి మిరుపురి కళాశాలకు చెందిన వసంత లక్ష్మి, సంగీత విద్వాంసుడు శ్రీరాజ్కుమార్ భారతీల బృందం ఆలపించిన గీతాలు భక్తులను మైమరపింపజేశాయి. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు మద్రాస్C భక్తులనుద్దేశించి ప్రసంగించారు. బాబా శివైక్యం పొంది నాలుగేళ్లు అవుతోందన్నారు. ఆయన మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వాటిని సాయి రాముడే నడిపిస్తున్నాడన్న విషయాన్ని ప్రతి భక్తుడు గుర్తించాలన్నారు. సత్యసాయి సర్వాంతర్యామి అని, ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కారని అన్నారు. గతంలో బాబా భక్తులకిచ్చిన దివ్యసందేశాన్ని డిజిటల్ స్క్రీన్ల ద్వారా వినిపించారు. వేడుకలకు హాజరైన భక్తులు,విద్యార్థులు మహాసమాధి చెంత ప్రణమిల్లి సత్యసాయిని శరణువేడారు. నారాయణసేవ : ఆరాధనోత్సవాల్లో భాగంగా స్థానిక హిల్వ్యూ స్టేడియంలో మహా సత్యసాయి నారాయణ సేవ నిర్వహించారు. ఉదయం 10.30కి సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదంతో పాటు,చీర, ధోతీ అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, నాగానంద, మద్రాస్ శ్రీనివాస్, టీకేకే భగవత్, ఎస్వీ గిరి,ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్ రావు, మాజీ మంత్రి గీతారెడ్డి, టీవీఎస్ సంస్థల అధినేత శ్రీనివాసన్,ఆయన సతీమణి మల్లికా శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాల కొనసాగింపే సత్యసాయికి నిజమైన నివాళి మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి టౌన్ : ఆశయాల కొనసాగింపే సత్యసాయికి నిజమైన నివాళి అని రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి ఆరాధనోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. హిల్వ్యూ స్టేడియంలో నారాయణ సేవ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్యం, తాగునీరు అందివ్వడంతో పాటు ఆధ్యాత్మిక బోధనల ద్వారా మానవాళికి మహోన్నతమైన సేవలను అందించిన సత్యసాయి భక్తుల మదిలో నిలిచిపోయారన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. వెలకట్టలేని బహుమతి సాయి అవతారం : సమత, మమతలను బోధిస్తూ మానవాళి శ్రేయస్సుకు పాటుపడిన సత్యసాయి అవతారం భక్తులకు వెలకట్టలేని బహుమతి అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ అన్నారు. ఆరాధనోత్సవాలలో భాగంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సర్వాంతర్యామి అని, అందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయని తెలిపారు. సత్యసాయి తన తల్లికి ఇచ్చిన మాట మేరకు ఎన్నటికీ పుట్టపర్తిని వీడరన్నారు. ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోతాం : సత్యసాయి ఆశయాలను ట్రస్ట్ మరింత ముందుకు తీసుకెళుతుందని ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు అన్నారు. నారాయణసేవ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ట్రస్ట్ రూ.80 కోట్లతో 118 గ్రామాలకు తాగునీరు అందించిందన్నారు. పుట్టపర్తి నగరపంచాయతీ పరిధిలోని గ్రామాలకు మరో రూ.2 కోట్లతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సత్యసాయి విద్యాసంస్థల్లో ప్రమాణాలను మెరుగు పరిచేందుకు రూ.7 కోట్లతో ల్యాబొరేటరీ, రూ.20 కోట్లతో పరికరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సత్యసాయి జీవించిన యజుర్ మందిరం సందర్శనకు భక్తులను అనుమతించడానికి కొంత స్థలాభావ సమస్య ఉందన్నారు. సత్యసాయి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
సత్యసాయి వర్దంతి వేడుకల్లో ఐశ్వర్య!
-
సత్యసాయి పేరిట పోస్టల్ కవరు విడుదల
శ్రీకాకుళం, న్యూస్లైన్: సత్యసాయిబాబాపై భారత తపాలా శాఖ రూపొందించిన కవరును కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భగవాన్ సత్యసాయిబాబా సేవాతత్పరుడన్నారు. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎంతో చొరవ చూపారని, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడన్నారు. దైవగుణాలతో అందరికీ చేరువై చక్కని మార్గాన్ని నిర్దేశిం చిన మహనీయుడని చెప్పారు. సత్యసాయి సేవామార్గాన్ని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదం కావాలనే ఉద్దేశంతో తపాలాశాఖ ప్రత్యేకంగా కవరును రూపొందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టెలికాం సలహామండలి సభ్యుడు వీవీఎస్ ప్రకాష్, ఏపీ సర్కిల్ ప్రధాన పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్, విశాఖపట్నం పోస్టుమాస్టర్ ఎం.సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సత్యసాయి 88వ జయంతి
-
నేడు సత్యసాయి 88వ జయంతి
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలు శనివారం జరగనున్నాయి. ఆయన 88వ జయంతి వేడుకలను వైభవంగా చేసేందుకు సత్యసాయి ట్రస్టు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. 1926 నవంబర్ 23వ తేదీన జన్మించిన సత్య సాయిబాబా, 2011 ఏప్రిల్ 24వ తేదీన పరమపదించిన విషయం తెలిసిందే. సత్యసాయి జయంతి సందర్భంగా ఆయన పేరు మీద రూ. 5 విలువైన పోస్టల్ స్టాంపును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి పుట్టపర్తిలో విడుదల చేయనున్నారు. అలాగే, 80 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి పథకాన్ని కూడా సత్యసాయి ట్రస్టు ప్రారంభించనుంది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.