
పుట్టపర్తి అర్బన్: ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి వేడుకలు ఈ నెల 18 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ 18న పట్టణంలో నిర్వహించే వేణుగోపాలస్వామి రథోత్సవంతో బాబా జయంతి వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 18, 19 తేదీల్లో జాతీయ యువజన సమ్మేళన సదస్సులు స్థానిక సత్సంగ్ హాల్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. 20, 21 తేదీల్లో అంతర్జాతీయ వేద సదస్సు స్థానిక పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉంటుందని తెలిపారు. సదస్సులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారన్నారు. 22న సత్యసాయి విశ్వ విద్యాలయ 36వ స్నాతకోత్సవం స్థానిక సాయికుల్వంత్ హాల్‌లో ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా లండన్‌లోని షీఫెల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆం«థోని ఆర్ వెస్ట్ హాజరు కానున్నట్లు చెప్పారు. అదే రోజు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారన్నారు. అదే రోజు స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని వినిపిస్తారని తెలిపారు. 23న సత్యసాయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment