యువకుడి మృతదేహంతో రాస్తారోకో చేస్తున్న బంధువులు, స్నేహితులు , (ఇన్‌సెట్) లకావత్ అశోక్ (ఫైల్)
టేకులపల్లి: ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా..టేకులపల్లి పోలీసులు ఏకపక్షంగా వ్యవహ రించడం వల్లనే ఇలా జరిగిందని అతడి బంధువులు ఆరోపిస్తూ..సోమవారం మృతదేహంతో టేకులపల్లి బోడు సెంటర్‌లో ఆందోâýæన నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
కోయగూడెం గ్రామ పంచాయతీ జేత్యాతండాకు చెందిన లకావత్ అశోక్(21) ఆదివారం రాత్రి పురుగులమందు తాగి, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. గతంలో ఇతను టేకులపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించి, ఈ ఏడాది జులైలో వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని రెండు రోజుల అజ్ఞాతం తర్వాత స్వగ్రామానికి వచ్చారు. పోలీస్ స్టేష¯ŒSలో ఇరువైపుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చాక..యువతి తల్లి దండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. వారు ఇతడితో పెళ్లికి నిరాకరించడంతో..ఇటీవల ఇతను తీవ్ర మనస్తాపానికి గురై..ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి మృతదేహంతో మృతుడి బంధువులు, స్నేహితులు బోడు రోడ్డు సెంటర్‌లో గంటపాటు రాస్తారోకో చేశారు. టేకులపల్లి ఏఎస్‌ఐ ఏకపక్షంగా వ్యవహరించారని, అమ్మాయి తరఫు వారు పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ ఘటన జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. సీఐ సంధిరి సంపత్‌కుమార్, ఎస్‌ఐ తాటిపాముల సురేష్ ఆందోâýæన వద్దకు చేరుకొని..బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో వారు శాంతించారు. మృతుడి తండ్రి దేవ్‌సింగ్ ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు యువతి తల్లిదండ్రులు, మేనమామ, బంధువులైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేశారు. ఆందోళనలో దేవ్‌సింగ్, జముక్ తదితరులు పాల్గొన్నారు.
-
ఆమెనే ఇంటికి వెళ్తానంది..
మూడు నెలల క్రితం సదరు యువకుడికి, యువతికి పోలీస్ స్టేష¯ŒSలో కౌన్సెలింగ్ ఇచ్చాం. ఆమె తన ఇçష్ట ప్రకారమే తల్లిదండ్రుల వెంట వెళ్లింది.
– టి.సురేష్, ఎస్సై, టేకులపల్లి.
-
అతడితో పెళ్లి ఇష్టం లేదు..
లకావత్ అశోక్‌తో పెళ్లి ఇష్టం లేదు. అందుకే తల్లిదండ్రుల వద్దే ఉంటున్నా. గతంలో అతడి ఫ్రెండ్స్, సోదరుడు భయపెట్టి, బలవంతంగా పెళ్లి చేశారు. అందుకే విడిపోయి అమ్మానాన్నలతో వెళ్లా. పోలీస్ స్టేషన్‌లో చెప్పే మా ఇంటికి వచ్చి ఉంటున్నా.
– అశోక్‌తో వీడిన యువతి