with
-
'తొలిప్రేమ' వాసుకి పుట్టినరోజు.. భర్తతో సింపుల్‌గా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అంబానీ పెళ్లికి రాశీ ఖన్నా ఇలా ముస్తాబైంది! (ఫోటోలు)
-
మాల్యా ఇంట పెళ్లి సందడి : లవర్‌తో సిద్ధూ వెడ్లాక్ (ఫొటోలు)
-
Viral Video: చిన్నారులతో హుషారుగా డ్యాన్స్ వేసిన అసోం సీఎం హిమంత బిస్వా శర్మ
-
కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే..
-
విడాకులు తీసుకుని పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్
-
ప్రేమలో పడ్డ ప్రభాస్ ..?
-
వైరల్ వీడియో : బెలూన్ తో ఆటలాడుతున్న కుక్క
-
కల్తీ విత్తనాలతో ముప్పు
తగ్గుతున్న దిగుబడులు మేనేజ్ డైరెక్టర్ అమరేంద్రరెడ్డి గొల్లప్రోలు (పిఠాపురం) : కల్తీ, నకిలీ విత్తనాలు వల్ల పంట దిగుబడులు తగ్గుతున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెంట్ మేనేజ్మెంట్ (మేనేజ్) డైరెక్టర్ అమరేంద్రరెడ్డి తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేనేజ్ డైరెక్టర్ అమరేంద్రరెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం గొల్లప్రోలులో ఆదివారం పర్యటించింది. స్థానిక వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయం వద్ద రైతులు నుంచి సమగ్ర సమాచారం సేకరించారు. రైతులు సాగుచేస్తున్న వరి వంగడాలు, దిగుబడులుపై అధ్యయనం చేశారు. ఖరీఫ్, రబీలో ఎదురైన సమస్యలు, తెగుళ్లపై వివరాలు సేకరించారు. సరాసరి పెట్టుబడి, దిగుబడిపై అంచనాలు వేశారు. అనంతరం అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ బృందం పర్యటిస్తుందన్నారు. ఇప్పటి వరకూ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తి చేశామన్నారు. గొల్లప్రోలు మండలంలో మూడు రోజులు పాటు పర్యటిస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో అత్యధికంగా సాగుచేస్తున్న సాంబమసూరి (బీపీటీ 5204)కు ప్రత్యామ్నాయంగా 2011లో రూపొందించిన ఆర్పీ బయో 226 రకం మంచి దిగుబడినిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎండాకు తెగులును సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు ఎకరాకు 5 నుంచి 10 బస్తాలు అధిక దిగుబడులు వస్తుందన్నారు. గత రెండు మూడేళ్లుగా ఆర్పీ బయోలో కేళీలు అధికంగా రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కల్తీ, నకిలీ విత్తనాలు నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు 500 మంది రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అసిస్టెంట్ బాలాస్వామి, ఎంపీఈఓ రాజేష్ తదితరులు ఉన్నారు. -
కుటుంబ కలహాలతో.. కడతేరిపోవాలని..
-
కుటుంబ కలహాలతో.. కడతేరిపోవాలని..
ముగ్గురు బిడ్డలతో కాలువలోకి దూకిన అక్కాచెల్లెళ్లు బాలుడి మృతదేహం గుర్తింపు ముగ్గురి గల్లంతు సురక్షితంగా బయటపడ్డ చెల్లెలు కొత్తపేట : కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ముగ్గురు బిడ్డల సహా కాలువలో దూకిన వైనమిది. ఒక బాలుడి మృతదేహాన్ని గుర్తించగా ఒక మహిళ సహా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. మరో మహిళ ప్రాణాలతో బయటపడింది. ఘటనకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఐదుగురు కొత్తపేట మండలం పలివెల లాకుల వద్ద బొబ్బర్లంక– అమలాపురం కాలువలో దూకారు. కొత్తపేట గ్రామానికి చెందిన వెత్సా బుచ్చిరాజు పెద్ద కుమార్తె విజయవాడకు చెందిన మానేపల్లి పుష్పావతి (35), ఆమె కుమారుడు అంజన్ (9), కుమార్తె మాన్విత (7), బుచ్చిరాజు రెండో కుమార్తె రాజమహేంద్రవరానికి చెందిన 30 ఏళ్ల నల్లమిల్లి ప్రమీల, ఆమె కుమార్తె శ్రీగోదా అలివేలు మంగతాయారు (5) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిలో నల్లమిల్లి ప్రమీల వంతెన సమీపంలో మునిగిపోతుండగా స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్చారు. పలివెల పెట్రోలు బంకు సమీపంలో పుష్పావతి కుమారుడు అంజన్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెవెన్యూ, పోలీసు సిబ్బంది గాలిస్తున్నారు. తల్లిదండ్రులను విజయవాడ వెళ్లనిచ్చి అఘాయిత్యం స్థానిక మెయిన్ రోడ్డులో నివాసం ఉంటున్న వెత్సా బుచ్చిరాజు – కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పుష్పావతిని విజయవాడకు చెందిన మానేపల్లి రణధీర్ గుప్తకు ఇచ్చి సుమారు పదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి అంజన్, మాన్విత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమార్తె ప్రమీలను రాజమహేంద్రవరానికి చెందిన నల్లమిల్లి వెంకటరత్నానికిచ్చి 2010 అక్టోబర్‌లో వివాహం చేశారు. వారికి శ్రీగోదా అలివేలు మంగతాయారు అనే కుమార్తె ఉంది. వెంకటరత్నం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలలు కాపురం సజావుగా సాగగా అనంతరం భార్యాభర్తల మధ్య అదనపు కట్నం విషయంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ నేపథ్యంలో ఏడాది క్రితం తన కుమార్తెతో పుట్టింటికి కొత్తపేట వచ్చేసింది. గతంలో మూడుసార్లు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా వుండగా విజయవాడకు చెందిన పెద్ద కుమార్తె పుష్పావతిని భర్త అనుమానించడంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఆమె కూడా మూడుసార్లు పుట్టింటికి వచ్చేయగా తల్లిదండ్రులు నచ్చచెప్పి పంపిం చారని సమాచారం. శనివారం భార్యాభర్తలు మళ్లీ గొడవ పడగా తండ్రికి ఫోన్ చేసింది. రేపు తాను వచ్చి మాట్లాడతానని చెప్పి ఆదివారం ఉదయం బుచ్చిరాజు తన భార్యను తీసుకుని విజయవాడ వెళ్లాడు. పుష్పావతి తన పిల్లలిద్దరినీ తీసుకుని కొత్తపేట వచ్చింది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ముగ్గురు పిల్లల సహా అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ ఎన్ శ్రీధర్, రావులపాలెం సీఐ బి. పెద్దిరాజు, ఎస్సై డి. విజయకుమార్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కాలువ పొడవునా గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పెద్దిరాజు తెలిపారు. ఆర్ఎస్ పరామర్శ, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరా ఈ సమాచారం తెలిసిన వెంటనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) కొత్తపేట ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రమీలను పరామర్శించి ఓదార్చారు. సంఘటనపై అధికారులను ఆరా తీశారు. స్థానికేతర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫోన్లో ఈ సంఘటనపై రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆరా తీశారు. సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. తన ప్రతినిధిగా జిల్లా వైఎస్సార్సీపీ సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావును అప్రమత్తం చేసి ఆస్పత్రికి పంపించారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంఘటనా స్థలికి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కుక్కల్లో కూడా అంతేనట..!
వాషింగ్టన్: అధిక ఒత్తిడి కారణంగా మానవులలాగానే కుక్కలు కూడా ప్రభావితమవుతాయట. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఫలితంగా వాటి బొచ్చుకూడా ముందుగానే తెల్లబడిపోతుందట. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఎక్కువ స్ట్రెస్ మూలంగా కుక్కల్లో కూడా ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ను గుర్తించినట్టు కొలరాడో పరిశోధకులు చెబుతున్నారు. కొలరాడో లో పరిశోధకులు 1-4 వయస్సున్న 400 ముదురు రంగు కుక్కలపై ఈ పరిశోధన జరిపారు. వాటి నమూనాలు ఛాయా చిత్రాలను సేకరించారు. మరోవైపు వాటి ఆరోగ్యం, ప్రవర్తనాతీరుపై అడిగి తెలుసుకునేందుకు వాటి యాజయానులకు ఒక ప్రశ్నాపత్రాన్ని అందించారు. పరిశోధన తరువాత కూడా ఫోటోలను పరిశీలించారు. దీంతో ముందు అస్పలు తెల్లగా లేని కుక్కల బొచ్చు పూర్తిగా తెల్లగా మారిపోయినట్టు గుర్తించారు. కుక్కల ఆరోగ్యం కూడా తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం చూపే అవకాశాలున్నట్టు తేల్చారు. వ్యాకులత, మానసిక ఆందోళన అధిక స్థాయిలో ఉన్న కుక్కల్లో బూడిద జుట్టును ఉంటుందని తెలివపారు. పెద్ద శబ్దాలచేయడం, ఏదో తెలియని భయంతో ఉన్నట్టుగా ప్రవర్తించడం దీనికి సంకేతాలని తెలిపారు. మానవులు భయపడినట్టుగానే ఇవికూడా ప్రవర్తిస్తాయని , ఈ ప్రవర్తనను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా 4 ఏళ్లలోపు కుక్కల్లో కనిపించే 'గ్రే మజిల్' ఆందోళన లేదా ఇతర భయం సంబంధితమైన ఆందోళనకు పరిస్థితులు హెచ్చరిక సంకేతం కావచ్చని పరిశోధకులు తెలిపారు.అంతేకాదు మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల్లోనే ఒత్తిడి ఎక్కువ అని కూడా తేల్చారు. మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల బొచ్చు చాలా తొందరగా తెల్లబడుతునట్టు ఈ అధ్యయనం లో తేలింది. ఈ పరిశోధనా పత్రాన్ని అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నలో ప్రచురించారు. ''క్వైట్ స్ట్రైకింగ్" గా ఈ రిపోర్టును అభివవర్ణించబడింది. -
మృత్యువుతో పోరాటం
బోన్‌మేరో వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు కంబాలచెరువు : ఆ చిన్నారికి వచ్చిన రోగానికి కొద్ది రోజుల్లో చికిత్స చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వైద్యం చేయించేందుకు ఆ పాప తల్లిదండ్రుల చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతో దాతల సాయం అర్థించారు. రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన మరుకుర్తి దుర్గారావు వికలాంగుడు. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న అతడికి భార్య లోవకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక పాప ఆనందిని సురక్షకు అనారోగ్యం సోకింది. స్థానిక వైద్యులకు చూపించారు. వారు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించడంతో లవ్ అండ్ కేర్ సొసైటీ అధ్యక్షుడు అవ్వారు జయరాజు, శాంతిల సాయంతో వైద్యులకు చూపించారు. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు ఆమెకు బోల్మేరో వ్యాధి సోకినట్టు నిర్థారించారు. దీనికి సుమారు రూ.40 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఏం చేయాలో తెలియని ఆ చిన్నారి తల్లిదంద్రులు తిరిగి ఇంటికి వచ్చేశారు. వీరి పరిస్థితి తెలిసిన రాజానగరంలోని కృషి ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు కొంత ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం ఆమె జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. రోజుకు రూ.8 వేలు ఖర్చవుతుందని, కొద్ది రోజుల్లో చికిత్స చేయకపోతే పాప దక్కదని వైద్యులు చెప్పారని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమార్తెను కాపాడాలని అభ్యర్థిస్తున్నారు. దాతలు ఎస్బీహెచ్ అకౌంట్ నంబర్ 62398326449కు ఆర్థిక సాయం అందించాలని, లేదా 9849684252 ద్వారా గానీ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మృతదేహంతో ఆందోళన
టేకులపల్లి: ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా..టేకులపల్లి పోలీసులు ఏకపక్షంగా వ్యవహ రించడం వల్లనే ఇలా జరిగిందని అతడి బంధువులు ఆరోపిస్తూ..సోమవారం మృతదేహంతో టేకులపల్లి బోడు సెంటర్లో ఆందోâýæన నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయగూడెం గ్రామ పంచాయతీ జేత్యాతండాకు చెందిన లకావత్ అశోక్(21) ఆదివారం రాత్రి పురుగులమందు తాగి, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. గతంలో ఇతను టేకులపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు. అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించి, ఈ ఏడాది జులైలో వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకొని రెండు రోజుల అజ్ఞాతం తర్వాత స్వగ్రామానికి వచ్చారు. పోలీస్ స్టేష¯ŒSలో ఇరువైపుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చాక..యువతి తల్లి దండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. వారు ఇతడితో పెళ్లికి నిరాకరించడంతో..ఇటీవల ఇతను తీవ్ర మనస్తాపానికి గురై..ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి మృతదేహంతో మృతుడి బంధువులు, స్నేహితులు బోడు రోడ్డు సెంటర్లో గంటపాటు రాస్తారోకో చేశారు. టేకులపల్లి ఏఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరించారని, అమ్మాయి తరఫు వారు పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ ఘటన జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. సీఐ సంధిరి సంపత్‌కుమార్, ఎస్ఐ తాటిపాముల సురేష్ ఆందోâýæన వద్దకు చేరుకొని..బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో వారు శాంతించారు. మృతుడి తండ్రి దేవ్‌సింగ్ ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు యువతి తల్లిదండ్రులు, మేనమామ, బంధువులైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేశారు. ఆందోళనలో దేవ్‌సింగ్, జముక్ తదితరులు పాల్గొన్నారు. ఆమెనే ఇంటికి వెళ్తానంది.. మూడు నెలల క్రితం సదరు యువకుడికి, యువతికి పోలీస్ స్టేష¯ŒSలో కౌన్సెలింగ్ ఇచ్చాం. ఆమె తన ఇçష్ట ప్రకారమే తల్లిదండ్రుల వెంట వెళ్లింది. – టి.సురేష్, ఎస్సై, టేకులపల్లి. అతడితో పెళ్లి ఇష్టం లేదు.. లకావత్ అశోక్‌తో పెళ్లి ఇష్టం లేదు. అందుకే తల్లిదండ్రుల వద్దే ఉంటున్నా. గతంలో అతడి ఫ్రెండ్స్, సోదరుడు భయపెట్టి, బలవంతంగా పెళ్లి చేశారు. అందుకే విడిపోయి అమ్మానాన్నలతో వెళ్లా. పోలీస్ స్టేషన్లో చెప్పే మా ఇంటికి వచ్చి ఉంటున్నా. – అశోక్‌తో వీడిన యువతి -
గుండెపోటుతో నవోదయ ఉపాధ్యాయుడి మృతి
కూసుమంచి : పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొడ్డేపల్లి తిరుపతి రావు (28) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతిచెందారు. రాత్రి విద్యాలయంలో భోజన సమయంలో మెస్‌కు తిరుపతిరావు రాకపోవడంతో గమనించిన సహచర ఉపాధ్యాయులు సెల్‌కు ఫోన్‌చేయగా స్పందించలేదు. ఈక్రమంలో వారు విద్యార్థులను పిలుచుకుని రమ్మని గదికి పంపడంతో అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని గమనించారు. విద్యార్థులు అట్టి విషయం సహచర ఉపాధ్యాయులతో తెలపటంతో హుటాహుటిని వెళ్లి అతనిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లుగా నిర్థారించారు. దీంతో విద్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా తీవ్రమైన గుండెపోటుతో రక్తనాళాలు పగిలి తిరుపతిరావు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని తెలిపారు. మృతుడు తిరుపతిరావు శ్రీకాకుళం సమీపంలోని కుగ్రామానికి చెందిన వాడని, అతను నెలక్రితమే కాంట్రాక్టు పద్ధతిలో సోషల్ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆయన మృతిపట్ల ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. -
ఊపిరితీసిన విద్యుదాఘాతం
టేకులపల్లి: బేతంపూడి గ్రామానికి చెందిన బైకాని సర్వేశ్(42) ఇంటికి సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ ప్రసారం కావడంతో..మృతి చెందాడు. ఇతను వ్యవసాయ పనులతో పాటు ఎలక్ట్రీషియన్‌గానూ పనిచేస్తుండేవాడు. సోమవారం ఇంటి వెనుక పని చేస్తుండగా..కరెంట్‌స్తంభం నుంచి తీసిన సర్వీసు వైరు కొంచెం తెగి..ఇంటి గోడలకు విద్యుత్ సరఫరా అయింది. ఇది గమనించని సర్వేశ్..పనిచేస్తూ అనుకోకుండా విద్యుత్ తీగను పట్టుకున్నాడు. షాక్‌కు గురై తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, పిల్లలు ఉన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సర్వేశ్ మృతదేహాన్ని సందర్శించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తానన్నారు. దండెం..యమపాశం కామేపల్లి: జాస్తిపల్లి గ్రామంలో పాటి వెంకటయ్య (70) అనే వృద్ధుడు తన ఇంటిలో ఇనుప దండెంపై కండువా తీస్తుండగా..ఇంల్లోని విద్యుత్ తీగ ద్వారా దీనికి విద్యుత్ సరఫరా జరిగి..కరెంట్ షాక్‌తో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..బైండింగ్ వైర్లతో ఏర్పాటు చేసుకున్న దండెంపై ఎప్పటి మాదిరే బట్టలు ఆరేశారు. ఈయన కండువా తీస్తుండగా..అప్పటికే గృహ విద్యుత్ వైరు నుంచి దీనికి విద్యుత్ సరఫరా అయిన విషయం గుర్తించక..విద్యుదాఘాతానికి గురై..కిందపడినప్పుడు తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
జేఎన్టీయూకే వీసీతో ఎన్టీయూ డైరెక్టర్ భేటీ
బాలాజీచెరువు (కాకినాడ) : సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ( ఎన్టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి మంగళవారం జేఎన్టీయూకే ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఎన్టీయూ అందిస్తున్న కోర్సులు, ఉపకార వేతనాలు, పరిశోధనలు తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జేఎన్‌టీయూకేతో కలిసి కొన్ని కోర్సులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్లతోనే తమ పాఠ్యప్రణాళిక రూపొందించి తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో రెక్టార్ ప్రభాకరరావు, రిజిస్ట్రార్ సాయిబాబు, ఓఎస్డీ ప్రసాద్‌రాజు పాల్గొన్నారు. -
శిశువును బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మరణించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం ఆందోళన చేశారు. కోరుకొండ మండలం శ్రీరంగంపట్నానికి చెందిన బాధితురాలి తండ్రి రాంబాబు ఈ వివరాలు తెలిపారు. రాంబాబు కుమార్తె కనికట్ల రమకు పురిటినొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన డ్యూటీ వైద్యులు, ఆ తర్వాత పట్టించుకోలేదు. 12 గంటల సమయంలో సాధారణ వార్డులోనే ప్రసవం జరిగిపోయింది. ఈ విషయం చెప్పాక వైద్య సిబ్బంది వచ్చారు. శిశువు పరిస్థితి బాగోలేకపోవడంతో వెంటిలైటర్‌పై ఉంచారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో శిశువును కాకినాడకు తీసుకెళ్లాలని చెప్పారు. అంబులెన్స్ కోసం రమ బంధువులు అడుగగా, లేదని సమా«ధానమిచ్చారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో శిశువును కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శిశువును పరిశీలించి, అప్పటికే చనిపోయిందని ధ్రువీకరించారు. దీనికి కారణం ఇక్కడి వైద్యుల నిర్ల్యక్షమేనంటూ రాజమహేంద్రవరం ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేశారు. ఆస్పత్రి ఆర్ఎంఓ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ రమకు బీపీ ఉందని, ఈ విషయాన్ని వారికి ముందే చెప్పామన్నారు. దీనివల్లే బిడ్డకు హాని జరిగిందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసి, సిబ్బంది తప్పు చేసిన ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
చిన్నారిపై మృత్యుఘాతం
విద్యుత్ తీగ తగలడంతో మృతి l నిర్లక్ష్యంగా చెట్ల కొమ్మలు నరికిన ఫలితం మూడేళ్ల చిన్నారిని నిర్లక్ష్యం బలిగొంది. విద్యుత్ తీగలకు అవరోధంగా ఉన్నాయంటూ చెట్ల కొమ్మలు నరకడంతో, తెగిపడిన విద్యుత్ తీగ ఆ బాలుడి పాలిట మృత్యుపాశంగా మారింది. – బలభద్రపురం (బిక్కవోలు) రంగంపేట మండలంలో పాడైన గుడ్లు తిని ఇద్దరు చిన్నారులు మరణించిన సంఘటన ను మరువక ముందే బిక్కవోలు మండలంలోని బలభద్రపురంలో సోమవారం మరో చిన్నారి విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. గ్రామంలోని 84వ అంగన్వాడీ కేంద్రం వద్ద జరిగిన ఈ సంఘటనలో ఆలపు సూరిబాబు, కుమారి పెద్ద కుమారుడు ఆలపు వేణు(3) అలియాస్ నాని పండు మరణించాడు. చిన్నారి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పెట్రోలు బంకు వెనుక చెట్ల కొమ్మలను కూలీలు తొలగించారు. ఈ క్రమంలో కొమ్మ పడడంతో విద్యుత్ తీగ తెగిపోయింది. ఈ విషయాన్ని కూలీలు యజమానికి చెప్పకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉన్న నానిపండు టాయిలెట్ కోసం చెట్టు వద్దకు వచ్చాడు. కిందపడి ఉన్న తీగను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే మరణించాడు. దీనిని గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, సరఫరాను నిలిపివేశారు. అప్పటికే చిన్నారి మరణించడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లి కుమారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. బంధువుల ఆగ్రహం అంగన్వాడీ సిబ్బంది కేంద్రాలను ఆయాలకు విడిచిపెట్టి, మీటింగులతో కాలయాపన చేస్తున్నారని, చిన్నారులను పట్టించుకోవడం లేదని నానిపండు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిక్కవోలు మండల పరిషత్‌లో నియోజకవర్గ స్థాయి తల్లిపాల వారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టు కొమ్మలు తొలగించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని తల్లిదండ్రులను పరామర్శించి, ట్రా¯Œæ్సకో, ఐసీడీఎస్ నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌బాబు ఆధ్వర్యంలో బిక్కవోలు హెచ్‌సీ నరసింహమూర్తి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విలువిద్యతో ఏకాగ్రత
చౌటుప్పల్: విల్లు విద్య ఏకాగ్రతను పెంచేందుకు ఎంతో దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎండీ.మక్బూల్‌అహ్మద్ అన్నారు. మండలంలోని తంగడపల్లిలోని ఎంఎంఆర్ వ్యాయామ విద్య కళాశాలలో శుక్రవారం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విల్లు విద్యను నేర్పించాలన్నారు. తద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మసై్థర్యం పెరుగుతాయన్నారు. అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అనంతరం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా జి.నారాయణరెడ్డి, అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎ.రామనర్సింహ్మారెడ్డి, జి.ఛండీదాస్, బుజ్జిబాయి, ప్రధాన కార్యదర్శిగా టి.విజయసాగర్, సహాయ కార్యదర్శులుగా నాగేశ్వర్రావు, ఎం.జోసెఫ్, ఎ.మల్లేష్, జి.స్వామిరాజు, కోశాధికారిగా కందాడి దశరథ, కార్యవర్గ సభ్యులుగా ఎన్.ప్రభాకర్‌రెడ్డి, టి.చంద్రశేఖర్, సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి, జి.రాంప్రసాద్, ఎస్.సుజన్‌కుమార్, టి.విజయ్‌కుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పి.శంకరయ్య, ఎస్.సారంగపాని, ఎస్.ఉదయభాస్కర్‌లు పాల్గొన్నారు. -
బతుకు ‘బస్తా’
పాత బస్తాలు కుడుతూ పలుకుటుంబాల జీవనం పని దొరికితే కూలి..లేకుంటే పస్తులే మరి జిల్లాకేంద్రంలో మారని కార్మికుల ‘అతుకుల’ బతుకులు పాతబస్తాలే వారి పొట్ట నింపుతున్నాయి. చిరిగిన గోనెసంచులకు అతుకులేసి..కొత్త బస్తాలు తయారు చేసే పనిలో అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. పత్తి, మిరప, ధాన్యం, సరుకులు నింపుకునేందుకు..పలు రకాల సైజుల్లో తయారు చేసి అమ్ముకోవడం ద్వారా ఉపాధి చూసుకుంటున్నారు. ఏళ్లుగా ఇదే పని చేస్తున్నా..ఎలాంటి ఎదుగూబొదుగూ లేక..అన్‌సీజన్‌లో పని దొరకక..అప్పులు భారమై..ఇళ్లు గడవడం కష్టమై అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక, రాయితీ రుణాలు లభించక జిల్లా వ్యాప్తంగా వెయ్యికిపైగా కుటుంబాల వారు..‘అతుకుల’ బతుకులతో అష్టకష్టాలు పడుతున్నారు. ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రం ఖమ్మంతో పాటు, నియోజకవర్గ కేంద్రాలు, పలు మండలాల్లో పాత బస్తాలు కుడుతూ, వాటితో తిరిగి కొత్త బస్తాలు తయారు చేస్తూ వెయ్యికిపైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఖమ్మం నగరంలో 70 పాత బస్తాల తయారీ, విక్రయ దుకాణాలు ఉన్నాయి. కార్మికులే తయారు చేసుకుంటూ, వారే కొట్లు నిర్వహించుకుంటున్నారు. కిరాణ దుకాణాలు, దాల్, రైస్ మిల్లులు, రేషన్ షాపుల్లో చిరిగి, పనికిరాని వాటిని బస్తాకు రూ.7 లేదా రూ.8 పెట్టి కొంటారు. ఈ బస్తాలను పూర్తిగా విప్పేసి, అతుకులు వేసి, తిరిగి మిషన్‌పై కుడతారు. పత్తి, మిరప, ధాన్యం నింపుకునేందుకు వివిధ సైజుల్లో తయారు చేస్తారు. పత్తి బస్తా అయితే 40 నుంచి 50 కిలోలు పట్టేలా, మిర్చిబస్తా అయితే 30 నుంచి 40 కిలోలు పట్టేలా, మొక్కజొన్నకు 60 కిలోలు, ధాన్యం బస్తా అయితే 70 కిలోలు పట్టేలా..మూడు పాత బస్తాలతో ఒక కొత్త బస్తాను రూపొందిస్తారు. రోజుకు 30 నుంచి 40 బస్తాల వరకు తయారు చేస్తుంటారు. మొత్తంమీద పాత బస్తాల నుంచి కొత్తగా ఇంకో బస్తా తయారు చేసేందుకు రూ.15పైనే ఖర్చవుతుంది. పెట్టిన ఖర్చులు పోను సీజన్‌ను బట్టి ఒక్కో బస్తాకు రూ.3 రూపాయల వరకు లాభం వస్తుంది. చిత్తు కాగితాలు నింపే బస్తాలను, వాటర్ బాటిళ్లు, పాత ఇనుప సామాన్లు నింపుకునేలా ప్లాస్టిక్ పట్టాలతో బోరాలను తయారు చేస్తారు. సీజన్..అన్‌సీజన్ రైతులకు పంటల దిగుబడి చేతికొచ్చే కాలమే వీరికి సీజన్. అంటే అక్టోబర్ నుంచి వేసవికాలం వరకు గిరాకీ ఉంటుంది. పాత బస్తాల కోసం తిరగడం, వాటిని కొట్టుకు చేర్చడం, అతుకులు, కుట్లు వేసి కొత్త బస్తాలు తయారు చేయడం ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు కూలి లభిస్తుంది. పత్తి, మిర్చి, ధాన్యం దిగుబడులొస్తున్నప్పుడు బస్తాల విక్రయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఆ కాలంలో ఒక్కో మనిషి రోజుకు రూ.500 వరకు ఆదాయం పొందుతారు. ఆ తర్వాతి రోజుల్లో పాత బస్తాలను కుట్టి నిల్వ ఉంచుతారు. కొన్నింటిని దుకాణాలకు తిరిగి విక్రయిస్తారు. ఎక్కువ కొనుగోళ్లు లేక కూలి కూడా గిట్టుబాటు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏడాదిలో ఆరు నెలలే ఎక్కువగా పని ఉంటుంది. అన్ సీజన్ అయిన..వర్షాకాలంలో బస్తాలను నిల్వ చేస్తూ, అప్పులు చేసి కుటుంబాలను సాకుతారు. ఇతర పనులు రాక, చేయలేక, ఈ పని నుంచి దూర కాలేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. రుణం..భారం పాత బస్తాల కొనుగోలు, దుకాణానికి అడ్వాన్స్, కిరాయి, ఇంటి అద్దె భారమవుతోంది. పాత బస్తాల వ్యాపారానికి కనీసం రూ.50వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అన్ సీజన్లో విక్రయాలు లేక, అప్పులకు వడ్డీలు కట్టలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా కుటుంబాల్లో మహిళలు, పిల్లలు కూడా ఇదే పనిలో ఉన్నారు. చేతితో, మిషన్లతో కుడుతున్నారు. తమకు బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని వీరు వేడుకుంటున్నారు. -
వనంతోనే మానవాళికి మనుగడ
ఏఎస్సీ సాయికృష్ణ ఖమ్మం అర్బన్ : వనం ఉంటే మానవాళి మనుగడకు ఎలాంటి ముప్పు ఉండదని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సరంక్షించాలని ఏఎస్పీ సాయికృష్ణ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా గురువారం బ్లూమింగ్ మైండ్స్ పాఠశాలలో మొక్కలు నాటి ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యాక్రమం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆంజనేయులు, కరస్పాండెంట్ పి.ఆశోక్‌రెడ్డి, ఎస్ఐ రఘు, ప్రిన్సిపాల్ బినియోఫ్రాన్సిస్, ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు. మొక్కలు నాటుతున్న ఏఎస్సీ సాయికృష్ణ -
ప్రాజెక్టుల రీడిజైన్‌తో తెలంగాణ సస్యశ్యామలం
కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టు పేరుతో దోపిడీ భట్టి వ్యాఖ్యలపై బాలసాని, కొండబాల ధ్వజం ఖమ్మం వైరారోడ్ : తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి నిర్మాణం చేపడుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇందిరాసాగర్–రాజీవ్‌సాగర్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి, పనులు చేయకుండానే రూ.3 వేల కోట్లను పంచుకుతిన్నారని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ఒక్క ఎకరానికి కూడా నీరందించకుండా నేడు దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో 150 పైగా లిఫ్ట్‌లు మూలనపడ్డాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ వాటన్నింటికీ మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. సొంత నియోజకవర్గంలోని జాలిముడి ప్రాజెక్టును పూర్తి చేయించలేని భట్టికి ప్రభుత్వాని విమర్శించే హక్కు లేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని వారు హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కమర్తపు మురళి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మందడపు సుధాకర్, మాటేటి నాగేశ్వరరావు, తిరుమలరావు పాల్గొన్నారు. -
నాన్నకు ప్రేమతో.. స్పెషల్ ఇంటర్వూ