మృతుడు తిరుపతిరావు (ఫైల్)
కూసుమంచి : పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొడ్డేపల్లి తిరుపతి రావు (28) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతిచెందారు. రాత్రి విద్యాలయంలో భోజన సమయంలో మెస్‌కు తిరుపతిరావు రాకపోవడంతో గమనించిన సహచర ఉపాధ్యాయులు సెల్‌కు ఫోన్‌చేయగా స్పందించలేదు. ఈక్రమంలో వారు విద్యార్థులను పిలుచుకుని రమ్మని గదికి పంపడంతో అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని గమనించారు. విద్యార్థులు అట్టి విషయం సహచర ఉపాధ్యాయులతో తెలపటంతో హుటాహుటిని వెళ్లి అతనిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లుగా నిర్థారించారు. దీంతో విద్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా గురువారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా తీవ్రమైన గుండెపోటుతో రక్తనాళాలు పగిలి తిరుపతిరావు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని తెలిపారు. మృతుడు తిరుపతిరావు శ్రీకాకుళం సమీపంలోని కుగ్రామానికి చెందిన వాడని, అతను నెలక్రితమే కాంట్రాక్టు పద్ధతిలో సోషల్ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆయన మృతిపట్ల ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర ఉపాద్యాయులు, విద్యార్థులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.