విలువిద్యతో ఏకాగ్రత
చౌటుప్పల్: విల్లు విద్య ఏకాగ్రతను పెంచేందుకు ఎంతో దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎండీ.మక్బూల్‌అహ్మద్ అన్నారు. మండలంలోని తంగడపల్లిలోని ఎంఎంఆర్ వ్యాయామ విద్య కళాశాలలో శుక్రవారం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విల్లు విద్యను నేర్పించాలన్నారు. తద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మసై్థర్యం పెరుగుతాయన్నారు.
అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి
అనంతరం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా జి.నారాయణరెడ్డి, అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎ.రామనర్సింహ్మారెడ్డి, జి.ఛండీదాస్, బుజ్జిబాయి, ప్రధాన కార్యదర్శిగా టి.విజయసాగర్, సహాయ కార్యదర్శులుగా నాగేశ్వర్‌రావు, ఎం.జోసెఫ్, ఎ.మల్లేష్, జి.స్వామిరాజు, కోశాధికారిగా కందాడి దశరథ, కార్యవర్గ సభ్యులుగా ఎన్.ప్రభాకర్‌రెడ్డి, టి.చంద్రశేఖర్, సీహెచ్.వేణుగోపాల్‌రెడ్డి, జి.రాంప్రసాద్, ఎస్.సుజన్‌కుమార్, టి.విజయ్‌కుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పి.శంకరయ్య, ఎస్.సారంగపాని, ఎస్.ఉదయభాస్కర్‌లు పాల్గొన్నారు.