మొక్కలు నాటుతున్న ఏఎస్సీ సాయికృష్ణ
-
ఏఎస్సీ సాయికృష్ణ
ఖమ్మం అర్బన్ : వనం ఉంటే మానవాళి మనుగడకు ఎలాంటి ముప్పు ఉండదని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సరంక్షించాలని ఏఎస్పీ సాయికృష్ణ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా గురువారం బ్లూమింగ్ మైండ్స్ పాఠశాలలో మొక్కలు నాటి ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యాక్రమం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆంజనేయులు, కరస్పాండెంట్ పి.ఆశోక్‌రెడ్డి, ఎస్‌ఐ రఘు, ప్రిన్సిపాల్ బినియోఫ్రాన్సిస్, ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు.
మొక్కలు నాటుతున్న ఏఎస్సీ సాయికృష్ణ