survive
-
లేలేలే.. లేలేలే.. నా రాజా
నిద్ర నుంచి ఎవరినైనా లేపొచ్చు.. ఈ పాటనే కాదు గానీ.. వేరే పాట పాడి కూడా లేపొచ్చు.. లేదా అలారం పెట్టి మరీ లేపొచ్చు. మరి.. శాశ్వత నిద్ర నుంచి.. అదేనండి.. చచ్చిపోయాక ఎవరినైనా లేపొచ్చా?? మేం లేపుతాం అని అంటున్నాయి కొన్ని కంపెనీలు.. అంతేకాదు.. తాము చెబుతున్నది అబద్ధం కాదని.. కావాలంటే మీరు చచి్చనంత ఒట్టు అని కొంచెం గట్టిగానే చెబుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో జనం ఈ ఒట్లను నమ్మారు. చచ్చాక కచి్చతంగా లేపుతారు కదూ అంటూ కంపెనీలతో తిరిగి ఒట్టేయించుకున్నారు కూడా.. వీళ్లంతా ఒట్లు తీసి గట్లు మీద పెట్టేలోపు.. మనం విషయంలోకి వెళ్లిపోదాం... రేయ్.. ఎవుర్రా వీళ్లంతావీళ్లంతా ఎవరంటే.. అల్కార్, టుమారో బయో, సదరన్ క్రయోనిక్స్, క్రియోరస్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అని ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్లేం చెబుతున్నారంటే.. చనిపోయాక మన శరీరాన్ని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. ‘ఫ్రిజ్’లాంటి దాంట్లో పెట్టేసి.. భవిష్యత్తులో అంటే ఏ 2100లోనో.. లేదా కల్కి 2898 ఏడీలోనో.. మరణాన్ని జయించే మందు లేదా ఏ జబ్బుతో చనిపోయారో దానికి చికిత్స వచి్చనప్పుడు మళ్లీ ‘లేపుతారట’!! ఇందుకోసం జస్ట్.. రూ.1.5–1.8 కోట్లు ఇస్తే చాలట.ఎవరు నమ్ముతారు అని అనుకుంటున్నారా.. చెప్పాంగా.. చాలామంది నమ్మారు. ఏకంగా 6 వేల మంది ఈ సరీ్వసును బుక్ చేసుకున్నారు. అందులో 500 మంది దాకా.. ఆల్రెడీ ‘ఫ్రిజ్’లో శాశ్వత నిద్రలో ఉన్నారు. భవిష్యత్తులో తమను నిద్ర లేపే అలారం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో సదరన్ క్రయోనిక్స్ ఇటీవలే 80 ఏళ్ల సిడ్నీవాసి మరణించాక.. అతడిని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. భద్రపరిచింది. ఇలా భద్రపరిచిన వాటిల్లో పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి.. అంతా క్రయోప్రిజర్వేషన్ మహిమ. అంటే.. అత్యంత శీతల వాతావరణంలోమానవ శరీరాన్ని భద్రపరచడం.1 మనిషి చనిపోయాక.. ఈ కంపెనీల ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగుతాయి. మెదడు ‘చనిపోకుండా’ప్రత్యేక పరికరాల ద్వారా ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేస్తారు.2 శరీరాన్ని ఐసులో ఉంచుతారు. రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తారు..3 ప్లాంట్‌కు వెళ్లాక.. శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయి దెబ్బతినకుండా ఉండటానికి వాటి నుంచి ద్రవాలను తీసేసి.. బదులుగాగ్లిజరాల్ బేస్డ్ రసాయనాన్ని ఎక్కిస్తారు (ఈ కంపెనీల్లో టుమారో బయో మాత్రం వాహనంలో ప్లాంటుకు తెస్తున్నప్పుడే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది)4 తర్వాత శరీరాన్ని డ్రై ఐసులో –130 డిగ్రీల ఉష్ణోగ్రతకు వెళ్లేదాకా ఉంచుతారు..5 అనంతరం లిక్విడ్ నైట్రోజన్ (–196 డిగ్రీలు) ఉన్న మెటల్ కంటైయినర్‌లో తలకిందులుగా వేలాడదీస్తారు. ఎందుకంటే.. ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయినా సరే.. మన మెదడు భాగం ద్రవాల్లోనే సురక్షితంగా ఉంటుంది. నమ్మకమే జీవితం..మనమా.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని.. అలానడుచుకుంటూ వెళ్లిపోదాం.. ఇంత చెబుతున్నారు సరే.. ఇంతకీ ఇది సాధ్యమేనా అంటే.. సినిమాల్లోనే అయితే సాధ్యమే. కానీ బయట అంటే.. ప్రస్తుతానికైతే చాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లను బతికించే టెక్నాలజీయే లేనప్పుడు ఇలా చేయడం మోసపుచ్చడమే అని విమర్శిస్తున్నారు. ఎప్పటికి వస్తుంది అంటే.. చెప్పడం కష్టమేనంటున్నారు.అయితే.. ఏదో సినిమాలో ‘నమ్మకమే జీవితం’అన్నట్లు ఈ కంపెనీలు మాత్రం భవిష్యత్తుపై ఆశలు చూపుతున్నాయి. ఇటు జనమూ అలాగే డబ్బులు కట్టేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సంపన్నులే. వీరు తమ సంపదను అనుభవించడానికి.. అలాగే అమరత్వం సాధించడానికి అన్నట్లుగా చేస్తుంటే.. మరికొందరు భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీలు, అద్భుతాలను వీక్షించేందుకు ఇదో అవకాశమని భావిస్తున్నారు. ఇప్పుడు నయంకాని జబ్బులను నయం చేసే మందులు భవిష్యత్తులో వస్తాయని వాళ్లు నమ్ముతున్నారు. అందుకే ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఇంతకీ మనమేం చేద్దాం.. -
అమెజాన్ కారడవిలో పసివాళ్లను కాపాడారు ఇలా.. (ఫొటోలు)
-
Turkey Syria Earthquake: ప్లీజ్ దేవుడా! ఒక్క బిడ్డనైనా కాపాడు..
టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆ శిథిలాల కింద చితికిన బతుకులు విషాధ గాథలు పేగులు మెలిపెట్టించేలా ఉన్నాయి. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, అనాథలుగా మారిన చిన్నారులతో కన్నీటి సంద్రాన్ని తలిపించేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. మరోవైపు కొందరూ ఆ శిథిలా కింద తమవారు బతికే ఉండాలని ఆత్రంగా ఎదురుచూపులు. ఆయా ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది శిథిలలు తొలగింపు కార్యక్రమాలు కొనసాగిస్తుండగా..నాజర్ అల్ వకా అనే వ్యక్తి ప్లీజ్ దేవుడా ఒక్క బిడ్డనైన బతికించు అంటూ దీనంగా విలపించాడు. సరిగ్గా ఆ శిథిలాల వద్ద వాకా కూర్చొని వారి కోసం ఆత్రుత పడుతుండగా కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. కాంక్రీట్ దిమ్మల మధ్య చితికిపోయిన తన భార్య, పిల్లలను చూసి అతను ఏడుస్తున్న విధానం అక్కడ ఉన్న అందర్నీ కంటతడి పెట్టించింది. వాకా ఎంతమంది పిల్లలను కోల్పోయాడనేది స్పష్టం కాలేదు గానీ, ఇద్దరు పిల్లలు మాత్రం రక్షక సిబ్బంది సజీవంగా తీసినప్పటికీ కాసేపటికే వారు చనిపోయారు. అతడి పెద్ద కుమార్తె తన చెల్లెలు మృతదేహాన్నిఒడిలో పెట్టుకుని విగతజీవిగా కనిపించింది. ఈ మేరకు వాక భూకంపం జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. సిరియా అంతర్యుద్ధంలో అతలా కుతలమైన నాటి ఘటనలు మళ్లీ పునురావృతమయ్యిందా! అన్నట్లు ఉంది అని కన్నీటిర్యంతమయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడూ తాను బయటకు పరుగుపెడుతూ..దేవుడా ఒక్క బిడ్డనైనా బతికించు చాలు అని ప్రార్థించాను, కానీ ఇప్పడూ తాను సర్వకోల్పోయానంటూ బోరుమన్నాడు. అక్కడి స్మసశాన వాటికలన్ని పెద్దలు, చిన్నారుల మృతదేహాలతో కిక్కిరిసిపోయాయి. (చదవండి: Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య) -
బాబోయ్.. వాళిద్దరు నీళ్లు తాగకుండా ఐదు రోజులు.. అది కూడా..
సిడ్నీ: మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బతకగలడు కానీ మంచినీళ్లు లేకుంటే మాత్రం బతకడం కష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు యువకులు మంచినీళ్లు తాగకుండా ఏకంగా ఐదు రోజులు బతికారంటే నమ్ముతారా. అయినా వారిద్దరు అలా ఉండడం వెనుక ఓ కథ ఉంది. వివరాల్లోకి వెళ్తే.. హెర్మాన్స్‌బర్గ్ అనే మారుమూల ప్రాంతానికి చెందిన షాన్ ఎమిట్జా (21), మహేశ్ పాట్రిక్ (14) అనే ఇద్దరు యువకులు గత మంగళవారం సెంట్రల్ ఆస్ట్రేలియాలోని హార్ట్స్ రేంజ్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. ట్రిప్ పూర్తి చేసుకుని తిరిగు ప్రయాణంలో వారు దారి తప్పిపోయారు. అదీ కూడా చెత్తాచెదారంతో నిండిన, వాతావరణం కూడా 40 డిగ్రీల పైనే ఉండడంతో పాటు కనీసం తాగునీరు కూడా దొరకని ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారు తప్పిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు హెలిక్యాప్టర్ సాయంతో వారి కోసం బయలుదేరారు. అలా వెళ్లిన పోలీసులకు ఐదు రోజులు తరువాత వారు దొరికారు. మహేశ్ ప్యాట్రిక్‌ను శుక్రవారం సాయంత్రం బుష్లాండ్ ప్రాంతంలో గుర్తించగా, శనివారం మరో ప్రాంతంలో షాన్ ఎమిట్జా ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. అయితే అప్పటికే వారిద్దరు డీహైడ్రేషన్‌కు గురై ఉండడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రిలో తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు సూచించారు. చదవండి: Snake Hanging On Overhead Cables: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము -
వామ్మో.. చూస్తుండగానే 60 అడుగుల కొండపై నుంచి..
లండన్: మనలో చాలా మంది కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి కొండలపైకి, కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ తమ వారితో సరదాగా గడిపి ఒత్తిడిని దూరం చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కొసారి ఈ విహారయాత్రలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. దీంతో, ఆ విహార యాత్ర కాస్త, విషాద యాత్ర గా మారిపోతుంది. అయితే, యూకేలోజరిగిన ఒక విషాదయాత్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్న్‌వాల్ లోని లామోర్నా కోవ్ పట్టణంలో రెబెకా క్రాఫోర్డ్ అనే 37 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉండేది. ఆమె గతేడాది తన సోదరి రెబెకా డెబ్స్తో కలిసి స్థానికంగా ఒక ఎత్తైన కొండపైకి వెళ్లారు. అక్కడ సరదాగా గడపాలను కున్నారు. ఈ క్రమంలో వారిద్దరు మాట్లాడుకుంటూ కొండ అంచుల వద్ద చేరుకున్నారు. అక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, వారు మాటల్లో పడి కొండ అంచున ఉన్న విషయం కూడా మరిచిపోయారు. అప్పుడు, రెబెకా క్రాఫోర్డ్ కొండపై నుంచి చూస్తుండగానే కాలుజారి కింద పడింది. దీంతో, రెబెకా డెబ్స్ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యింది. తన సోదరి కొండపై నుంచి కింద పడటాన్ని చూసింది. ఆమె నోటినుంచి మాట రాలేదు. తన అక్క అరుపులు, కేకలు వినిపించాయి. వెంటనే తేరుకుని యూకేలోని డయల్ అంబూలెన్స్‌కు ఫోన్ చేసింది. ఆ ప్రాంతం కొండపైన ఉండటంతో కాసేపటికి ఎయిర్ అంబూలెన్స్ సర్వీస్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను వెంటనే యూకేలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అయితే, రెబెకా ప్రస్తుతం కోలుకుంటుదని వైద్యులు తెలిపారు. అయితే, తాజాగా రెబెకా క్రాఫోర్డ్.. మెట్రో.కో.యూకే తో జరిగిన ఇంటర్వ్యూలో ఆ విషాదాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఆ భయంకర సంఘటన నా జీవితంలో మరిచిపోలేను’.. నేను నా సోదరితో కలిసి ఎత్తైన కొండపై ఉన్నప్పుడు అనుకోకుండా కింద పడ్డాను. నా సోదరి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందకు పడిపోయేటప్పుడు ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు. నేను బండలపై పడ్డాను. ఆ తర్వాత, నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రెబెకా డెబ్స్ మాట్లాడుతూ.. ఇలాంటివి బహుశా సినిమాల్లో చూసుంటారు. 60 అడుగుల ఎత్తైన కొండపైనుంచి పడి బతకడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు మా సోదరికి పెద్ద గాయాలేవి కాలేవు. ఏలాంటి, రక్త స్రావం జరుగలేదు. కానీ, ముఖం దగ్గర మాత్రం కుట్లు పడ్డాయని తెలిపింది. నడుము దగ్గర చిన్నగా ఫాక్చర్ అయ్యిందని వివరించింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపింది. తమ సోదరిని సమయానికి ఆసుపత్రికి చేర్చిన ఎయిర్ అంబూలెన్స్ సిబ్బందికి రెబెకా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. -
మృతదేహంలో కరోనా ఎంతకాలం ఉంటుంది?
న్యూఢిల్లీ: మొదటిసారిగా కోవిడ్–19 బాధిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. మృతుల శరీరాల్లో కరోనా వైరస్ ఎంత కాలం జీవిస్తుంది? మృతదేహం నుంచి కూడా ఆ వైరస్ ఇతరులకు సోకుతుందా? శరీరంలోని ఏఏ అవయవాలపై ఏ మేరకు ప్రభావం చూపుతోంది? అనే విషయాలను ఈ పోస్టుమార్టం ద్వారా పరిశీలించనుంది. ఈ అధ్యయనంలో పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల నిపుణుల సాయం కూడా తీసుకోనున్నట్లు ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా వెల్లడించారు. ‘ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే దీనికోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లాక ఏఏ అవయవాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది. మృత శరీరంలో ఎంత కాలం జీవిస్తుంది? వంటి అంశాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’అని డాక్టర్ గుప్తా చెప్పారు. కోవిడ్ బాధిత మృతదేహాలకు పోస్టుమార్టం చేపట్టినట్లయితే మార్చురీ సిబ్బందికి, పోలీసులకూ సోకడంతోపాటు మార్చురీ పరిసరాల్లోనూ వైరస్ ప్రభావం ఉంటుందని భావించిన ఐసీఎంఆర్.. శవపరీక్ష వద్దంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. -
అందుకోసం అడ్డమైన సినిమాలు చేశా.!
సాక్షి, సినిమా: వివాదాస్పద నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో రాధికా ఆప్టే ఒకరని చెప్పొచ్చు. తన వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి సంచలనానికి తెరలేపారు. ఇటీవల ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని ఆరోపణలతో కలకలం సృష్టించింది. ఇక రాధిక తరచూ గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు చేతినిండా పని చెబుతూ వారి విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే హిందీ చిత్రాల్లో విచ్చలవిడిగా తన అందాలను ఆరబోసి నటించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో నా శరీరం నా ఇష్టం అని ఇప్పటివరకూ ఎదురుదాడి చేసిన రాధిక ఇప్పుడు తాను గ్లామరస్‌గా నటించిన మాట నిజమేనని అంగీకరించింది. అందుకు కారణం కూడా చెప్పింది. ఇంతకీ రాధికా ఏం చెప్పారో చూద్దాం.. ‘సినిమా రంగంలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి అవకాశాలు సులభంగా లభిస్తాయి. అలా సినీ నేపథ్యం లేని వారు చాలా కష్టపడాల్సిందే. నాకు సినిమారంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే నేను చాలా కష్టపడ్డాను. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ రంగంలో ఎలాంటి చిత్రాల్లో నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చెత్త చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. జీవనాధారం కోసం అలాంటి అడ్డమైన చిత్రాలను నిరాకరించలేకపోయాను. అయితే ఇప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించుకున్నాను. అవకాశాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ అంగీకరించడం లేదని, నచ్చిన కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా’ అని చెప్పుకొచ్చారు. -
ప్రమాదాలను తప్పించుకొని బతకొచ్చు..!
మెల్బోర్న్ః భారీ కారు ప్రమాదం జరిగితే బతికే వారు అరుదే. అటువంటి ప్రమాదాలను ఎదుర్కొని ప్రాణాలకు నష్టం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలా అన్న ఆలోచననుంచి ఓ కళాకారుడికి తట్టిన రూపమే గ్రాహం. మనిషి కంటే కాస్త పెద్దదిగా.. మనిషిని పోలిన మనిషిగా రూపొందిన ఆ శిల్పాన్ని వినియోగించి, భవిష్యత్తులో ప్రమాద మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండదంటున్నాడు రూపకర్త, కళాకారుడు ప్యాట్రిసియా పిక్సినిని. ప్రముఖ ట్రౌమా సర్జన్, ట్రాష్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ పర్ట్ ల సహకారంతో రూపొందిన ఆ శిల్పం.. (గ్రాహం) ఇప్పుడు ఆస్ట్రేలియా రహదారి భద్రతా ప్రచారంలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. మెడ కనిపించకుండా ఉండే అతిపెద్ద హెల్మెంట్ లాంటి తల, వికారమైన శరీరాకృతి, గిట్టల్లా ఉండే పాదాలు, ఇంకా ఇతర అసాధారణ లక్షణాలతో కూడిన మానవాకృతి ఇప్పుడు ఆస్ట్రేలియా రహదారి భద్రతా ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అనుకోకుండా జరిగే కార్లు, వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడాలంటే ఏం చేయాలో చోదకులకు వివరించేందుకు వీలుగా కళాకారుడు ప్యాట్రిసియా పిక్సినిని.. ప్రముఖ ట్రౌమా సర్జన్, ట్రాష్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్ పర్ట్ సహకారంతో 'గ్రాహం' ను రూపొందించాడు. రహదారుల్లో పెరుగుతున్న మరణాలు, గాయాల సంఖ్య తగ్గించడం, నియంత్రించడంలో భాగంగా 'గ్రాహం'.. తో అవగాహనా కార్యక్రమం చేపడుతున్నట్లు ఆస్ట్రేలియా ట్రాన్స్ పోర్ట్ యాక్సిడెంట్ కమిషన్ సీఈవో.. జో కలాఫియోర్ తెలిపారు. విపరీతమైన వేగంతో కారు.. లేదా ఏదైనా వాహనం నడిపే సమయంలో యాక్సిడెంట్ అయితే ప్రాణాలతో బయటపడటం చాలా అరుదని, మానవుడి వేగంకంటే కార్ల వేగం చాలా ఎక్కువగా ఉండటంవల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవడం కష్టమౌతుందని కాలాఫియోర్ చెప్తున్నారు. అందుకే ప్రమాదాలనుంచి బయటపడేందుకు మనం చేసే తప్పులను, రోడ్ల వ్యవస్థను మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అటువంటివాటిని క్షుణ్ణంగా వివరించేందుకు గ్రాహం సహాయపడుతుందని కాలాఫియోర్ పేర్కొన్నారు. రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రిలో ట్రౌమా సర్జన్ గా పనిచేస్తున్న క్రిస్టియన్ కెన్ఫీల్డ్.., మోనాష్ యూనివర్శిటీ యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్ క్రాష్ పరిశోధకుడు డేవిడ్ లోగాన్ లు గ్రాహం రూపకల్పనకోసం మెల్బోర్న్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా కళాకారుడు పిక్సినిని కి సహకారం అందించారు. ఈ సందర్భంలో శరీరంలో ముఖ్యమైన భాగం తల అని, దానికి దెబ్బలు తగిలితే చాలా ప్రమాదం అని, అలాగే తల ముందుభాగం, వెనుక భాగం, మెదడు ఇలా తల్లోని భాగాలతోపాటు వెన్నెముక వంటి శరీర భాగాలకు గాయాలైతే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందన్న విషయాలను గ్రాహం చక్కగా చెప్తుందని కెన్ ఫీల్డ్ వివరించారు. అలాగే ప్రమాదాల్లో పక్కటెముకలు వంటివాటిని రక్షించేందుకు వీలుగా ఎయిర్ బ్యాగ్ లాంటి ఆకారం, రాపిడిని తట్టుకునేట్లు మందపాటి చర్మం వంటివన్నీ గ్రాహం రూపకల్పనలో కనిపిస్తాయి. చూసేందుకు అసహజంగా, ఓ భయంకరమైన హారర్ సినిమా మనిషిలా ఉన్నా... భారీ రోడ్డు ప్రమాదాలనుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మాత్రం గ్రాహం తో కల్పించే అవగాహన ఎంతో సహాయపడుతుందని చెప్తున్నారు. -
వనంతోనే మానవాళికి మనుగడ
ఏఎస్సీ సాయికృష్ణ ఖమ్మం అర్బన్ : వనం ఉంటే మానవాళి మనుగడకు ఎలాంటి ముప్పు ఉండదని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సరంక్షించాలని ఏఎస్పీ సాయికృష్ణ పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా గురువారం బ్లూమింగ్ మైండ్స్ పాఠశాలలో మొక్కలు నాటి ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యాక్రమం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆంజనేయులు, కరస్పాండెంట్ పి.ఆశోక్‌రెడ్డి, ఎస్ఐ రఘు, ప్రిన్సిపాల్ బినియోఫ్రాన్సిస్, ఏఎస్సై అప్పారావు పాల్గొన్నారు. మొక్కలు నాటుతున్న ఏఎస్సీ సాయికృష్ణ -
మొక్కల పెంపకంతోనే మనుగడ
నల్లగొండ : ప్రజలు, జీవకోటి మనుగడ కోసం మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం స్థానిక అటవీ కార్యాలయంలో రూ.కోటి 50 లక్షలతో నిర్మించిన హరిత నీలగిరి నందనవనాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అటవీ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పచ్చదనం లేకపోవడం వల్లనే వర్షాలు కురవడం లేదన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో పచ్చదనం ఉండటం వల్లే అధిక వర్షాలు కురుస్తున్నాయన్నారు. ప్రజల మనుగడ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలన్నారు. సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజలంతా సామాజిక బాధ్యతగా హారితాహారంలో మొక్కలు నాటుతున్నారన్నారు. 33 శాతం వనాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో 47 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన నందనవనం బాగుందని అభినందించారు. హైదరాబాద్‌లో 14 పార్కులను అభివృద్ధి చేశామన్నారు. కరువు పరిస్థితులకు కారణం అటవీ విస్తీర్ణం లేకపోవడమేనన్నారు. కోతులు వాపస్ పోవాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి ఊళ్లలోకి వచ్చిన కోతులు వాపస్ పోవాలి.. పోయిన వానలు వాపస్ రావాలి.. ఇందుకు ప్రజలంతా మొక్కలు నాటి రంక్షించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జాతీయ రహదారిపై నాటిన మొక్కలను రక్షిస్తామని అన్నారు. జిల్లాలో 4 కోట్ల 80 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నాటిన మొక్కల్లో 10 శాతం చనిపోయిన వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామన్నారు. నీరు ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువగా చెట్లు లేకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదన్నారు. తెలియక చెట్లు నరకడం వల్ల కరువు పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అందరూ మొక్కలు నాటాలన్నారు. ఇది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావ్, డీఎఫ్ఓ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, ఆర్ఎఫ్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఓ మాధవరావు, స్థానిక కౌన్సిలర్ అవుట రవీందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జెల్లా మార్కండేయులు, అబ్బగోని రమేశ్, దండంపల్లి సత్తయ్య, ఎడ్ల గీతా శ్రీనివాస్, నారబోయిన భిక్షం పాల్గొన్నారు. -
పిల్లులు.. కుక్కలను తింటున్నారు!
ఐసిస్ అధీనంలోని నగరాల్లో చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా అందంగా కనిపించినవారు కూడా ఎముకల గూడుల్లా తయారయ్యారు. కడుపు నిండని తల్లులు.. తమ బిడ్డలకు పాలు ఇవ్వలేని దీనావస్థకు చేరుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనలేక, కడుపు మాడ్చుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు. అన్నం స్థానంలో గడ్డి, మూలికలు, వేళ్ల వంటి వాటితో కడుపునింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక చివరికి పిల్లులను, కుక్కలను చంపి తినేందుకూ వెనుకాడటం లేదు. సిరియా ముట్టడి ప్రాంతంలో శిశువులు వేలాది మంది పస్తులతో మరణిస్తున్నారు. నెలల వయసులోనే పోషకాహారం అందక తనువు చాలిస్తున్నారు. ఒకప్పుడు చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన డైర్ అజోర్ ప్రాంతం ఇప్పుడు మహిళలు, పిల్లల మరణాలకు సాక్షీభూతంగా నిలుస్తోంది. మధ్య ప్రాంతం నుంచి తప్పించుకొని డీర్ ఎజోర్ లో చిక్కుకున్న వేలాదిమంది శరణార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారు. బషర్ అల్ అస్సాద్ అందించే చాలీచాలని సరుకుల పంపిణీ.. శరణార్థులను చిక్కిశల్యమయ్యేలా చేస్తోంది. ఆహారధాన్యాలు అందించాలంటే సైన్యాధీనంలో ఉన్న ఆ ప్రాంతానికి కేవలం కార్గో విమానాలు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీంతో చాలా మంది పిల్లలు.. తిండిలేక ఆకలితో మరణిస్తున్నారు. ఎముకల గూడుకు చర్మం అతికించినట్లుగా మారిపోతున్నారు. వేలాదిమంది చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. అతిసారం వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని శిశువుల చిత్రాలను చూస్తే అక్కడి వాస్తవిక పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. 11 నెలల నుంచి ఐసిస్ ముట్టడిలో ఉన్న డైర్ అజోర్లో చిక్కుకున్న సుమారు లక్ష మందికి పైగా శరణార్థులు ఆకలి, అనారోగ్యాలతో బాధపడుతూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. బషర్ అల్ అస్సద్ అధీనంలోకి డైర్ అజోర్ జిల్లాలు చేరిన 8 నెలలకు ఆ బిడ్డలు పుట్టినట్లు తెలుస్తోంది. పరిస్థితి దీనావస్థలో ఉన్న సమయంలో శుక్ర్ అల్ అఫ్రే. పుట్టాడు. అతని తల్లి మన్నార్ కస్సర్ అల్ డఘిమ్ ఆహారం లేక కనీసం బిడ్డకు పాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో పోషకాహారం లేని ఆ చిన్నారి తీవ్ర రక్తహీనతకు లోనయ్యాడు. బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు దుఖసాగరంలో జీవిస్తున్నారు. చావైనా తమను కరుణించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తీవ్ర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. తిండిలేక, బతికేందుకు ఆసరా లేక శరణార్థులు చావే శరణ్యంగా జీవిస్తున్నారు. ముట్టడి ప్రాంతంలో సాధారణ జీవన పరిస్థితులు చిన్నాభిన్నమైపోయాయని, శరణార్థులు తిండిలేక.. ఆకలి తట్టుకోలేక ఏం కనిపించినా తినే స్థితికి చేరారని చెప్తున్నారు. స్థానిక జనజీవనం స్తంభించిపోయి, ఆస్పత్రుల్లో రోగులు, బయట సైనికులను మాత్రమే చూడగలిగే పరిస్థితి దాపురించిందని స్థానిక దుకాణదారుడు అబుల్ ఖాసిం చెప్తున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా తిండి కోసం జనం ఎదురు చూస్తున్నారని, పిల్లలను బతికించుకునేందుకు వేడినీటిలో ఉప్పు కలిపి, బ్రెడ్ తో పెడుతున్నారని అంటున్నాడు. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా, భయంకరంగా మారుతోందని చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు పిల్లల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కొందరు ఆహారం కోసం ఇంట్లోని వస్తువులు, ఇళ్ళూ అమ్మేసిన దాఖలాలున్నాయి. కొందరు గడ్డి, మూలికలు, ఆకులు తింటుంటే.. మరి కొందరు కుక్కలు, పిల్లులను చంపి తినడం శోచనీయంగా మారింది. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు వంద రెట్లు పెరిగిపోయాయి. ఇప్పుడక్కడ ముగ్గురికి మాత్రమే తిండి దొరుకుతోంది. ఒకటి సైన్యం, మరొకరు విదేశాల్లో బంధువులు ఉన్నవారు, ఇంకొకరు సంపన్నులు. మిగిలినవారంతా కష్టాల కడలిలో జీవనం సాగిస్తున్నారు. ఆహారం అందే మార్గం లేక, ధరాఘాతాన్ని తట్టుకోలేక పొట్ట చేత పట్టుకొని, కళ్ళల్లో ప్రాణం పెట్టుకొని నిర్జీవంగా బతుకుతున్నారు. -
56 బోగీలు మీద నుంచి పోయినా..
-
56 బోగీలు మీద నుంచి పోయినా..
పురులియా(బెంగాల్): భూమి మీద నూకలు ఉండాలే గానీ పిడుగొచ్చి ఒళ్లోపడినా ప్రాణం పోదంటారు. సరిగ్గా పశ్చిమ బెంగాల్లో ఇలాగే జరిగింది. ఓ మహిళ పట్టాలు దాటుతుండగా అనూహ్యంగా గూడ్సురైలు దూసుకొచ్చింది. దాదాపు 56 బోగీలతో ఉన్న ఆ రైలు మీద నుంచే వెళ్లిన ఆ మహిళకు స్వల్ప గాయాలు కూడా అవలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్ లోని పురూలియాలో హిమానీ మాంజి(45) అనే మహిళ తాతా నగర్ వెళ్లేందుకు తన ఇంటి నుంచి బయలు దేరింది. రైలు ద్వారా ఆమె వెళ్లేందుకోసం స్టేషన్ కు బయలు దేరి పట్టాల గుండా నడవడం ప్రారంభించింది. పట్టాలుదాటేందుకు ప్రయత్నిస్తుండగా అనుకోకుండా కాళ్లకు రాళ్లు తగిలి రెండు పట్టాల మధ్యలో పడిపోయింది. ఈ లోగా వేగంగా గూడ్సు రైలు దూసుకొచ్చింది. దీంతో అక్కడే ఉన్న రైలు గార్డులు ఆమెను అప్రమత్తం చేసి అలాగే ఉండమని, పైకి లేవొద్దని, రైలు పూర్తిగా వెళ్లిపోయేవరకు అలాగే పడుకుని కదలకుండా ఉండమని సూచించారు. దీంతో ఆమె తన గుండె చేతపట్టుకొని కప్పలాగా ట్రాక్ మధ్యలో అతుక్కుపోయింది. అందరూ చూస్తుండగానే రైలు వచ్చి ఆమె పట్టాల మధ్యనఉండగా వెళ్లిపోయింది. అనంతరం రైలు వెళ్లాక రైల్వే సిబ్బంది ఇతర ప్రయాణీకులు ఆమెను పట్టాల నుంచి పైకి లేపి తీసుకొచ్చి పక్కనే సురక్షితంగా కూర్చొబెట్టారు. -
కూలిన విమానంలో 7 ఏళ్ల చిన్నారి క్షేమం
న్యూయార్క్: అదృష్టమంటే ఈ ఏడేళ్ల చిన్నారిదే. ఘోర విమాన ప్రమాదం నుంచి మృత్యుంజయురాలిగా బయటపడింది. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శుక్రవారం ఈ అబ్బురపరిచే ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ విమానం దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో కూలిపోయింది. పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. అయితే విమానంలో ఉన్న ఏడేళ్ల బాలిక ఈ ప్రమాదం నుంచి బయటపడింది. విమాన శకలాల నుంచి నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న ఓ ఇంటి దగ్గరకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అత్యవసర బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ప్రాణాపాయ గాయలు కాలేదని తెలిపారు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు ఫేస్బుక్లో పేర్కొన్నారు. -
చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు
న్యూఢిల్లీ: అదృష్టమంటే ఇండోనేసియాకు చెందిన ఈ జంటదే. మృత్యువు దగ్గరగా వెళ్లబోయి చివరి నిమిషంలో తప్పించుకున్నారు. హర్టనో, లానో హర్టనో అనే దంపతులు.. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో వారు ప్రయాణించాల్సివుంది. ఇందుకోసం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. క్రిస్మస్ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలసి గడపాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సురబయ నుంచి 162 మందితో బయల్దేరిన విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే హర్టనో దంపతులు షాక్ తిన్నారు. తాము ప్రాణాలతో బయటపడినా.. ఈ ప్రమాదం జరగడం తమను కలచి వేసిందని లానో హర్టనో అన్నారు. -
ఓ శవపేటిక.. మనిషిని బ్రతికించింది!!
-
అంగుళం దూరంలో.. మృత్యువు ఆగింది..!