చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు | They cancelled the ticket at the last moment and survive | Sakshi
Sakshi News home page

చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు

Published Wed, Dec 31 2014 3:40 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు - Sakshi

చివర్లో టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుని బతికిపోయారు

న్యూఢిల్లీ: అదృష్టమంటే ఇండోనేసియాకు చెందిన ఈ జంటదే. మృత్యువు దగ్గరగా వెళ్లబోయి చివరి నిమిషంలో తప్పించుకున్నారు.

హర్టనో, లానో హర్టనో అనే దంపతులు.. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో వారు ప్రయాణించాల్సివుంది. ఇందుకోసం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. క్రిస్మస్ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలసి గడపాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సురబయ నుంచి 162 మందితో బయల్దేరిన విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే హర్టనో దంపతులు షాక్ తిన్నారు. తాము ప్రాణాలతో బయటపడినా.. ఈ ప్రమాదం జరగడం తమను కలచి వేసిందని లానో హర్టనో అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement