సాక్షి, ముంబై: ఎయిర్ ఆసియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ఫ్లైయింగ్ లైసెన్సింగ్‌లో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫెర్నాండెజ్ సహా ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందుకోసం ఫెర్నాండెజ్ ప్రభుత్వ ఉద్యోగులకు కుమ్మక్కయ్యారని పేర్కొంది. సీఈఓతో ఫెర్నాండెజ్‌పాటు సింగపూర్‌కు చెందిన ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ డైరెక్టర్ రాజేంద్ర దూబే, ఎయిర్ ఆసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, ఎయిర్ పోర్ట్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్, మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తమ దాడులు జరుగుతున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.
అంతర్జాతీయ విమానయాన సేవల కోసం లైసెన్సు విధానంలో అక్రమాలతోపాటు, విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపిబి) నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ అధికారులు చెప్పారు. విమానయాన రంగంలోని 5/20 నియమాల సడలింపు కోసం ఎయిర్ ఏసియాకు చెందిన డైరెక్టర్లు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. 5/20 నియమావళి అంటే, ఒక సంస్థకు ఐదు సంవత్సరాలు అనుభవం, 20 విమానాలను కలిగి వుండాలి. అపుడు మాత్రమే అంతర్జాతీయ లైసెన్స్ కోసం అర్హత వుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment