Tony Fernandes
-
‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో
ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ వివాదంలో చిక్కుకున్నారు. తమ కంపెనీ వర్క్ కల్చర్‌పై గొప్పలు చెప్పారు. ఆపై అబాసు పాలయ్యారు? బాడీ మసాజ్ చేయించుకునే సమయంలో కూడా మేనేజ్మెంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలు కల్పిస్తుందంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఫెర్నాండేజ్ షర్ట్ లేకుండా ఓ వైపు మసాజ్ చేయించుకుంటూ మరోవైపు ఆఫీస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం మనం చూడొచ్చు. వారంలో పని ఒత్తిడి, వెరానిటా యోసెఫిన్ సలహా మేరకు మసాజ్ చేయించుకుంటున్నాని క్యాప్షన్ ఇచ్చారు. మసాజ్ చేయించుకునేందుకు అనుమతి ఉందని.. ఇండోనేషియా, ఎయిర్ ఏషియా కల్చర్ ఇష్టపడతానని చెప్పారు. ఆఫోటోపై నెటిజన్స్ మండి పడుతున్నారు. పలువురు నెటిజన్లు ఇలాంటి చర్యల వల్ల ఎయిర్ ఏసియా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. వెంటనే ఫెర్నాండేజ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంటే.. సంస్థ గొప్పతనం గురించి ఇలా వివరించడం సరైంది కాదని అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటోలు ఏవియేషన్ విభాగంలో కాక రేపుతుండగా.. ఈ ఫోటోలు ఫెర్నాండెజ్ షేర్ చేశారా? లేదంటే ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఇలా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి లింక్డిన్లో పోస్ట్ చేశారా? అని తెలియాల్సి ఉంది. -
కుంభకోణం సెగ, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!
కౌలాలంపూర్ : మలేషియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినీతి, లంచాల ఆరోపణలపై ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దర్యాప్తు ముమ్మరమవుతున్న నేపథ్యంలో సంస్థ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తాత్కాలికంగా పదవినుంచి తప్పుకున్నారు. ఫెర్నాండెజ్‌తో పాటు, విమానయాన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కమారుద్దీన్ మెరానున్ కూడా పదవినుంచి వైదొలగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందనీ, రెండు నెలల కాలానికి లేదా కంపెనీ సరిపోతుందని భావించే సమయానికి వారు ఎగ్జిక్యూటివ్ పదవులకు దూరంగా ఉంటారని ఎయిర్ ఏషియా ప్రకటనలో తెలిపింది. అలాగు గ్రూపు ప్రెసిడెంట్ కనకలింగంను తాత్కాలిక సీఈవోగా నియమించింది. అనుమానాస్పద లంచాలు, అవినీతిపై బహిరంగ దర్యాప్తుకు సంబంధించి ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికన్ అధికారులతో ఒప్పందం చేసుకున్నామని ఎయిర్‌బస్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ఏషియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మధ్యంతర సీఈవో కనకలింగం యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 180 విమానాల కొనుగోలు, ఎయిర్ ఏషియాఎక్స్ క్రీడా జట్టుకు స్పాన్సర్‌షిప్‌గా ఎయిర్‌బస్ నుండి సుమారు 50 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై మలేషియా అవినీతి నిరోధక కమిషన్(ఎంఏసీసీ) తెలిపింది. దేశానికి వెలుపల ఎక్కడైనా పౌరులు లేదా శాశ్వత నివాసితులు చేసిన అవినీతి చర్యలపై దర్యాప్తు చేసే అధికారం ఉందని శనివారం ప్రకటించింది. ఎయిర్ బస్-ఎయిర్ ఏషియా వివాదంలో యూకే అధికారులతో సంప్రదింపులతోపాటు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని ఎంఏసీసీ చీఫ్ కమిషనర్ లతీఫా కోయా చెప్పారు. మరోవైపు యూరోపియన్ తయారీదారుతో చర్చలు జరపడానికి మధ్యవర్తులను ఎప్పుడూ ఉపయోగించలేదని ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారించేందుకు కంపెనీ బోర్డు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సలహాదారులుగా, ఫెర్నాండెజ్, మెరానున్కు బోర్డులో కార్యనిర్వాహక అధికారం ఉండదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. తాముగానీ, సీఈవో ఫెర్నాండెజ్, మెరానున్గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్ ఏషియా మరియు ఎయిర్ ఏషియా ఎక్స్ షేర్లు పడిపోయాయి. కాగా పౌర, సైనిక ఒప్పందాలను పొందటానికి ఎయిర్ ఏషియా కంపెనీ మధ్యవర్తులను ఉపయోగించిందన్న ఆరోపణలపై బ్రిటీష్ మోసపూరిత నిరోధక సంస్థ ఎస్ఎఫ్వో (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్) 2016 లో దర్యాప్తు ప్రారంభించింది. -
ఫేస్‌బుక్‌కు మరో ఎదురు దెబ్బ
కౌలాలంపూర్ : అసత్య, నకిలీ వార్తలు, వీడియోలతో ఇబ్బందులు పాలవుతున్న సోషల్ మీడియా ప్లాట్‌పాం ఫేస్‌బుక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫేక్ న్యూస్‌ను నిరోధించడంలో ఫేస్బుక్ విఫలమవుతోందని ఆరోపిస్తూ ఎయిర్ ఏసియా సిఈఓ టోనీ ఫెర్నాండెజ్ తన ఫేస్బుక్ ఖాతాను రద్దు చేసుకున్నారు. కమ్యూనికేట్ చెయ్యడానికి గొప్ప వేదిక ఫేస్బుక్. తాను సోషల్ మీడియా అభిమానిని అయినప్పటికీ, ఫేక్‌న్యూస్ ఇబ్బందులు తనకు కూడా తప్పలేదన్నారు. వీటన్నింటితోపాటు న్యూజిలాండ్ ఘటన తనను బాధించిందని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఉదంతంలో దుండగుడి ఊచకోత దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం, ఆ విడియో భారీ ఎత్తున షేర్ కావడం పట్ల నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఫేస్బుక్ కేవలం ఆర్థిక ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించకుండా ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ హితవు పలికారు. 6 లక్షల70 వేలమంది ఫాలోయర్స్ ఉన్న టోనీ తన నిర్ణయాన్ని వరుస ట్వీట్ల ద్వారా ఆదివారం ప్రకటించారు. సోషల్ మీడియాలో మంచికి మించి కొన్నిసార్లు ద్వేషమే ఎక్కువగా విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థ ఇంకా చాలా చేయాల్సి వుందని టోనీ పేర్కొన్నారు. చదవండి : 24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు Facebook could have done more to stop some of this. I myself have been a victim of so many fake bitcoin and other stories. 17 mins of a live stream of killing and hate!!!! Its need to clean up and not just think of financials. — Tony Fernandes (@tonyfernandes) March 17, 2019 It is a great platform to communicate. Strong engagement and very useful but New Zealand was to much for me to take along with all the other issues. — Tony Fernandes (@tonyfernandes) March 17, 2019 -
‘ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ’
సాక్షి, హైదరాబాద్: ‘‘అక్రమ మార్గంలో ఏ పని జరగాలన్నా ఆయనను కలిస్తే సరిపోతుంది.. ఆయన అవినీతి ప్రపంచ స్థాయికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ చంద్రబాబు నాయుడే. ఓట్లు వేసిన ప్రజల్ని దారుణంగా వంచించిన ఆయన.. పక్కరాష్ట్రాలకు వెళ్లి ఏపీ పరువు తీస్తున్నారు..’’ అంటూ ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి తీరును తూర్పారపట్టారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. ఎయిర్ ఏషియా కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్లు బయటపడటంతో వారి అవినీతి స్థాయి ఏమిటో మరోసారి బట్టబయలైందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!) ‘‘చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంతదాకా విస్తరించిందో ఎయిర్ ఏషియా కుంభకోణంతో మరోసారి బయటపడింది. అక్రమ మార్గాల్లో ఆయన చేయలేని పనులంటూ లేవని రుజువులు దొరికాయి. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఎల్లో మీడియా మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. పెట్రోల్‌పై వ్యాట్ పేరుతో వాహనదారుల నడ్డివిరుస్తున్నారు. గిట్టుబాటు ధర రానీయకుండా రైతులను దగాచేస్తున్నారు..’’ అని భూమన అన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రచురించిన కథనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణలో చంద్రబాబు దళారీల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అంతర్జాతీయంగా కలకలం రేపుతోన్న ఈ ఉదంతంపై టీడీపీతోపాటు పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయంది. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!) మీడియాతో మాట్లాడుతున్న భూమన -
ఎయిర్ ఏషియా స్కాంలో చంద్రబాబు
-
చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఆడియో టేపుల్లో దొరికిపోయారు. చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోకగజపతిరాజుల వ్యవహారం ఈ టేపుల్లో బయటపడింది. గతంలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఈసారి ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోన్న ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించింది. దీనికి సంబంధించి ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణను ఆ పత్రిక ప్రచురించింది. ‘‘మనం ఎలాగోలా కొత్త రూట్లకు సంబంధించిన లైసెన్సులను సంపాదించాలి. ఎంత ఖర్చయినా పరవాలేదు. ఎవరిని పట్టుకుంటే పనవుతుంది? ఎలాగోలా ఈ పని చేయాల్సిందే.’’అని టోనీ ఫెర్నాండెజ్ చెబుతుండగా.. ‘‘ఈ పని చేయాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు. ఆయనను ఒప్పించగలిగితే మొత్తం పని అయిపోతుంది. ఈ పనిని చంద్రబాబు ద్వారా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనిషే ఇపుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉన్నాడు.’’అని మిట్టూ శాండిల్య వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపుల్లో ఉండడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఎయిర్ ఏషియా కుంభకోణంపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెల్సిందే. విదేశీ రూట్ల లైసెన్సులను దొడ్డిదారిన పొందడానికి గాను భారతీయ అధికారులకు లంచాలిచ్చినట్లు బయటపడడంతో వారిని అరెస్టు చేసి సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి గతంలో జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులు బయటపడడం, అందులో చంద్రబాబు, అశోక గజపతి రాజు పేర్లు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌తో అశోక గజపతిరాజు సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలలో టీడీపీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు కూడా ఉండడం గమనార్హం. టోనీ ఫెర్నాండేజ్, శాండిల్య మధ్య జరిగిన సంభాషణలివీ.. ప్రముఖ లాబీయిస్టు రాజేందర్ దూబే సమక్షంలో శాండిల్యకు, టోనీ ఫెర్నాండెజ్‌కు మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఆడియో టేపులను బిజినెస్ టుడే బయటపెట్టింది. వాటిలో ఏమున్నదంటే.. టోనీ ఫెర్నాండెజ్: నాకు ఎయిర్ ఏషియా ఇండియా ఇంటర్నేషనల్ రూట్ పర్మిట్లు కావాలి. ఏ మార్గం ఎంచుకున్నా ఒకే. ఇందుకోసం కొంత నష్టపోవడానికి కూడా సిద్ధమే. నిజాయితీగా సరైన మార్గంలో వెళితే పర్మిట్లు రావడానికి చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లైనా సరే త్వరగా ఇంటర్నేషనల్ పర్మిట్లు తీసుకురండి. శాండిల్య : సరే సర్.. అంటే అడ్డదారిలో వెళ్లమంటారా? టోనీ ఫెర్నాండెజ్: యెస్. నేను చెప్పింది చేయి. లైసెన్స్‌కోసం ఏదైనా చేయి. ఇక్కడ మన పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. పని పూర్తయ్యేటట్లు చూడు. శాండిల్య : ప్రస్తుత నియంత్రణ నిబంధనల ప్రకారం చూస్తే మనం మరో మార్గంలో వెళ్లాలి. ప్రభుత్వంలో ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో నాకు తెలుసు. కీలక స్థానంలో ఉన్న పై స్థాయి వ్యక్తి నుంచి కింద స్థాయి వరకు వెళ్లాలి. టోనీ ఫెర్నాండెజ్: స్థానికంగా ఉన్న దూబే, మీరు కలిసి చూసుకోండి. వారితో బేరసారాలు చేయండి. ఎలా చేస్తారన్నది నీ ఇష్టం. నువ్వు అంతర్జాతీయ లైసెన్స్ తీసుకువస్తే మీకు అదనపు విమానాలను సమకూరుస్తాను. శాండిల్య : ‘సమర్థత’ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనతో మనం జాగ్రత్తగా డీల్ చేస్తే మొత్తం పనయిపోతుంది. పైగా గతంలో చంద్రబాబు వద్ద ఆర్థికమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజే ఇప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన మనతో ప్రత్యక్షంగా కనిపించడానికి ఇష్ట పడటం లేదు కానీ అడిగిన పని చేసి పెడతా అన్నారు. ఇలాంటివాడు మనతో ఉండటం మన అదృష్టం. హైదరాబాద్ కేంద్రంగానే సాగిన వ్యవహారం.. ఈ మొత్తం వ్యవహారమంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగినట్లు మరికొన్ని సాక్షాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ రాయబేరం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీని రంగంలోకి దింపడానికి ఎయిర్ ఏషియా హైదరాబాద్ నోవాటెల్‌లో సమావేశమైనట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి 21, 2015లో హైదరాబాద్‌లో జరిగిన 11వ ఎయిర్ ఏషియా ఇండియా బోర్డు మీటింగ్‌లో సింగపూర్‌కు చెందిన హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ పీటీఈని లాబీ కోసం నియమిస్తూ తీసుకున్న కాపీని మనీ కంట్రోల్ వెబ్సైట్ వెలుగులోకి తీసుకొచ్చింది. టేపుల్లో ఫెర్నాండెజ్ స్థానికంగా ఉన్న వ్యక్తిని రాయబేరాలకు తీసుకోమనడం.. హైదరాబాద్ కేంద్రంగా బోర్డు సమావేశంలో హెచ్ఎన్ఆర్ ట్రేడెండ్‌కు చెందిన రాజేంద్ర దూబేకు బాధ్యతలు అప్పచెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అప్పటికి ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఆడియో టేపులు వెలుగులోకి రాకపోవడంతో చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి విదితమే. ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడిన తర్వాతనే చంద్రబాబు తన కార్యక్షేత్రాన్ని అమరావతికి మార్చారు. కాగా మలేషియా ఎయిర్‌లైన్స్ కంపెనీ ఈ రాయబేరాల కోసం ఒక సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదీ ఎయిర్ ఏషియా కుంభకోణం.. మలేషియాకు చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా 2014లో టాటా గ్రూపుతో కలిసి దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టింది. కానీ అప్పటి నిబంధనల ప్రకారం స్థానికంగా 5 ఏళ్లు సర్వీసులు నడిపి, 20 విమానాలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అనుమతిచ్చేవారు. దీన్నే 5/20 నిబంధన అని పేర్కొంటారు. కానీ ఎయిర్ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా, విస్తారా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది. ఆ విధంగా ఎయిర్ ఏషియా దేశీయ విమానయానంలోకి అడుగు పెట్టిన రెండేళ్లలోనే ఈ లైసెన్స్‌ను దక్కించుకుంది. ఇలా బయటకు వచ్చింది... రతన్ టాటా, సైరస్ మిస్త్రీ మధ్య జరిగిన వివాదంతో ఈ కేసు బయటకు వచ్చింది. అప్పటి టాటా గ్రూపు చైర్మన్‌గా ఉన్న సైరస్ మిస్త్రీ ఎయిర్ ఏషియా లైసెన్స్‌లు దక్కించుకోవడంలో రూ.22 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ 2017మార్చిలో శాండిల్యాను ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ.. ఫెర్నాండెజ్‌తో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఏషియా ఇండియా ఆ సంస్థకు రూ.12.28 కోట్లు చెల్లించి, ఈ మొత్తాన్ని రాయబేరాలకు వినియోగించినట్లు సీబీఐ పేర్కొంటోంది. విచారణలో భాగంగా 6వ తేదీ ఫెర్నాండేజ్‌ను హజరు కావాల్సిందిగా సీబీఐ సమన్లు పంపింది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. -
ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు
-
ఎయిర్ ఏషియా స్కాం : చంద్రబాబు పేరు
న్యూఢిల్లీ : ఎయిర్ ఏషియా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్ ఏషియా లంచాలు ఎర వేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను అరెస్టు చేసింది. అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్(ఎడమ), ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యా(కుడి) ‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్ గజపతి రాజే చెప్పారు.’ అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడారు. అయితే, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. బీజేపీతో తెగదెంపుల సందర్భంగా అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. -
ఎయిర్‌లైన్స్ సీఈవోపై సీబీఐ కేసు
సాక్షి, ముంబై: ఎయిర్ ఆసియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ సీబీఐ గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ఫ్లైయింగ్ లైసెన్సింగ్‌లో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఫెర్నాండెజ్ సహా ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందుకోసం ఫెర్నాండెజ్ ప్రభుత్వ ఉద్యోగులకు కుమ్మక్కయ్యారని పేర్కొంది. సీఈఓతో ఫెర్నాండెజ్‌పాటు సింగపూర్‌కు చెందిన ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ డైరెక్టర్ రాజేంద్ర దూబే, ఎయిర్ ఆసియా డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, ఎయిర్ పోర్ట్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్, మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తమ దాడులు జరుగుతున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమానయాన సేవల కోసం లైసెన్సు విధానంలో అక్రమాలతోపాటు, విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపిబి) నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ అధికారులు చెప్పారు. విమానయాన రంగంలోని 5/20 నియమాల సడలింపు కోసం ఎయిర్ ఏసియాకు చెందిన డైరెక్టర్లు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. 5/20 నియమావళి అంటే, ఒక సంస్థకు ఐదు సంవత్సరాలు అనుభవం, 20 విమానాలను కలిగి వుండాలి. అపుడు మాత్రమే అంతర్జాతీయ లైసెన్స్ కోసం అర్హత వుంటుంది. -
'నా హృదయం బాధతో నిండిపోయింది'
కౌలాలంపూర్: తన హృదయం బాధతో నిండిపోయిందని ఎయిర్ ఆసియా విమానయాన సంస్థ సీఈవో, ప్రవాస భారతీయుడు టోనీ ఫెర్నాండెస్ పేర్కొన్నారు. క్యూజెడ్ 8501 విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎయిర్ ఆసియా తరపు సంతాపం ప్రకటించారు. తమ సిబ్బంది కుటుంబ సభ్యులు అందించిన సహకారం స్ఫూర్తిదాయకమని, తనకెంతో బలమిచ్చిందన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో ఉన్న సిబ్బంది, పైలట్ల కుటుంబాలతో తాను మాట్లాడనని చెప్పారు. కేవలం ముగ్గురు కుటుంబాలను కలవడం కుదరలేదన్నారు. తానిప్పుడు కష్టమైన రోజులు ఎదుర్కొంటున్నానని ట్విటర్ లో పేర్కొన్నారు. గల్లంతైన ప్రయాణికుల కుటుంబ సభ్యులతోకూడా మాట్లాడానని వెల్లడించారు. విమానం సుముద్రంలో కూలిపోయిందని తెలియడంతో సురబయకు వెళ్తుతున్నట్టు తెలిపారు. -
మరెన్నో టేకాఫ్‌లకు చాన్స్..
బెంగళూరు: జనాభాతోపాటు, టూరిజం పరిశ్రమను పరిగణనలోకి తీసుకుంటే దేశీ విమానయాన రంగంలో భారీ అవకాశాలున్నాయని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. టూరిజంకున్న అవకాశాలతో పోలిస్తే ఈ రంగం చాలా వెనకబడి ఉన్నదని చెప్పారు. వెరసి నాలుగో బడ్జెట్ విమానయాన సంస్థకు సైతం గరిష్ట స్థాయిలో అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఇందుకు పోటీదారులు సంస్థలెన్ని ఉన్నాయన్న లెక్కలుమాని, చౌక ధరల్లో సర్వీసులను అందించాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు. గత నెల 12న తొలిసారి బెంగళూరు నుంచి గోవాకు విమాన సర్వీసును నిర్వహించడం ద్వారా ఎయిర్ ఏషియా దేశీయ కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా గురువారమిక్కడ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో కంపెనీ సీఈవో టోనీతోపాటు సంస్థ ముఖ్య సలహాదారు రతన్ టాటా, చైర్మన్ ఎస్.రామదొరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో టోనీ మాట్లాడుతూ దేశీ విమానయాన రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యధికులకు చాన్స్... పోటీ సంస్థలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా అందుబాటు ధరల్లో సర్వీసులను నిర్వహించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ సూచించారు. తద్వారా అత్యధిక శాతం ప్రజలకు విమానయానాన్ని చేరువ చేయవచ్చునని తెలిపారు. చౌక ధరల సర్వీసులతో వ్యాపారాలు తదితర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించే వారి సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించాలని సలహా ఇచ్చారు. ఇదే విధంగా స్వదేశీ సందర్శనకు వచ్చే విదేశీయులకు అవకాశాలు పెంచాలని చెప్పారు. టికెట్ ధరలను సాధ్యమైనంతమేర తగ్గించడం ద్వారా వృద్ధి అవకాశాలను అందుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వ్యయాలతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా, ఈ నెల 20 నుంచి ఎయిర్ ఏషియా కొచ్చికి సైతం విమాన సర్వీసులను నిర్వహించనుంది. ఏడాది కాలంలో బ్రేక్ఈవెన్ సాధిస్తాం ఏడాది కాలంలో ఎయిర్ ఏషియా లాభనష్టాలులేని స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుకుంటుందని టోనీ అంచనా వేశారు. ఇందుకు మరిన్ని ప్రణాళికలను అమలు చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఆరు విమానాలతో సర్వీసులను విస్తరించనున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు
తొలి విమానం బెంగళూరు-గోవాకు ముంబై: ఎయిర్ ఏషియా ఇండియా విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో దేశీయ విమానయాన రంగంలో తీవ్రమైన పోటీకి తెర లేచిందని నిపుణులంటున్నారు. ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన సర్వీసులను అందిస్తుంది. టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ, ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. టైర్ టూ నగరాలపై దృష్టి ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమానం నేడు బెంగళూరు నుంచి గోవాకు 3.10 గంటలకు ప్రారంభం కానున్నది. అత్యంత చౌక ధరలకే విమానయానాన్ని అందిస్తామంటున్న ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ టైర్ టూ నగరాలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. బెంగళూరు-గోవా, బెంగళూరు-చెన్నైలకు విమాన చార్జీలను రూ.999కే అందించడం ద్వారా ఈ సంస్థ ఇప్పటికే ధరల పోరుకు తెర తీసింది. ఈ బుకింగ్స్ ప్రారంభమైన 10 నిమిషాలకే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. -
12 నుంచి ఎయిర్ఏషియా ఫ్లయిట్ సర్వీసులు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా దేశీయంగా జూన్ 12 నుంచి విమానయాన సర్వీసులు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి (శుక్రవారం) అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఎయిర్ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్విటర్లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అయితే, తొలుత ఏ రూట్లో సర్వీసులు నడపనున్నదీ వెల్లడించలేదు. ఎయిర్ఏషియా ఇండియా .. చెన్నైని హబ్‌గా పరిగణిస్తుండటంతో అక్కణ్నుంచే ఫ్లయిట్ సేవలు మొదలు కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. టాటా సన్స్, వ్యాపారవేత్త అరుణ్ భాటియాకి చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్, మలేసియాకి చెందిన ఎయిర్ఏషియా కలిసి ఎయిర్ఏషియా ఇండియా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సంస్థకి ఈ నెలలోనే ఫ్లయింగ్ పర్మిట్లు లభించాయి. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ తదితర చౌక విమానయాన సంస్థలకు పోటీగా అత్యంత తక్కువ చార్జీలతో ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపడంపై కంపెనీ దృష్టి పెడుతోంది. ప్రస్తుత మార్కెట్ చార్జీల కంటే తమ రేట్లు సుమారు 35 శాతం తక్కువగా ఉండగలవంటూ ఎయిర్ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య గతంలో తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది వ్యవధిలో పది ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని నిర్దేశించుకుంది.