ఫేస్‌బుక్‌కు మరో ఎదురు దెబ్బ | AirAsia CEO quits Facebook over Christchurch videos  | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌కు మరో ఎదురు దెబ్బ

Published Mon, Mar 18 2019 12:28 PM | Last Updated on Tue, Mar 19 2019 8:03 AM

AirAsia CEO quits Facebook over Christchurch videos  - Sakshi

ఎయిర్‌ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌( ఫైల్‌ ఫోటో)

కౌలాలంపూర్ : అసత్య, నకిలీ వార్తలు, వీడియోలతో ఇబ్బందులు పాలవుతున్న సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ఫేస్‌బుక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫేక్‌ న్యూస్‌ను నిరోధించడంలో ఫేస్‌బుక్‌ విఫలమవుతోందని ఆరోపిస్తూ ఎయిర్  ఏసియా సిఈఓ టోనీ ఫెర్నాండెజ్  తన ఫేస్‌బుక్ ఖాతాను రద్దు చేసుకున్నారు. కమ్యూనికేట్ చెయ్యడానికి గొప్ప వేదిక ఫేస్‌బుక్‌. తాను సోషల్‌ మీడియా అభిమానిని అయినప్పటికీ, ఫేక్‌న్యూస్‌ ఇబ్బందులు తనకు కూడా తప్పలేదన్నారు. వీటన్నింటితోపాటు న్యూజిలాండ్‌ ఘటన  తనను  బాధించిందని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్వీట్‌ చేశారు.

న్యూజిలాండ్‌ క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఉదంతంలో దుండగుడి ఊచకోత దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం, ఆ విడియో భారీ ఎత్తున షేర్‌ కావడం పట్ల నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఫేస్‌బుక్‌ కేవలం ఆర్థిక ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించకుండా ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ హితవు పలికారు. 6 లక్షల70 వేలమంది ఫాలోయర్స్‌ ఉన్న టోనీ తన నిర్ణయాన్ని వరుస ట్వీట్ల ద్వారా ఆదివారం ప్రకటించారు. సోషల్ మీడియాలో మంచికి మించి కొన్నిసార్లు ద్వేషమే ఎక్కువగా విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు.  ఈ విషయంలో సంస్థ ఇంకా చాలా చేయాల్సి వుందని టోనీ పేర్కొన్నారు.   

చదవండి : 24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement