ఫేస్‌బుక్‌కు మరో ఎదురు దెబ్బ
కౌలాలంపూర్ : అసత్య, నకిలీ వార్తలు, వీడియోలతో ఇబ్బందులు పాలవుతున్న సోషల్ మీడియా ప్లాట్‌పాం ఫేస్‌బుక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫేక్ న్యూస్‌ను నిరోధించడంలో ఫేస్బుక్ విఫలమవుతోందని ఆరోపిస్తూ ఎయిర్ ఏసియా సిఈఓ టోనీ ఫెర్నాండెజ్ తన ఫేస్బుక్ ఖాతాను రద్దు చేసుకున్నారు. కమ్యూనికేట్ చెయ్యడానికి గొప్ప వేదిక ఫేస్బుక్. తాను సోషల్ మీడియా అభిమానిని అయినప్పటికీ, ఫేక్‌న్యూస్ ఇబ్బందులు తనకు కూడా తప్పలేదన్నారు. వీటన్నింటితోపాటు న్యూజిలాండ్ ఘటన తనను బాధించిందని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్వీట్ చేశారు.
న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఉదంతంలో దుండగుడి ఊచకోత దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం, ఆ విడియో భారీ ఎత్తున షేర్ కావడం పట్ల నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఫేస్బుక్ కేవలం ఆర్థిక ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించకుండా ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ హితవు పలికారు. 6 లక్షల70 వేలమంది ఫాలోయర్స్ ఉన్న టోనీ తన నిర్ణయాన్ని వరుస ట్వీట్ల ద్వారా ఆదివారం ప్రకటించారు. సోషల్ మీడియాలో మంచికి మించి కొన్నిసార్లు ద్వేషమే ఎక్కువగా విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థ ఇంకా చాలా చేయాల్సి వుందని టోనీ పేర్కొన్నారు.
చదవండి : 24 గంటల్లో 1.5 మిలియన్ల వీడియోలు తొలగింపు
Facebook could have done more to stop some of this. I myself have been a victim of so many fake bitcoin and other stories. 17 mins of a live stream of killing and hate!!!! Its need to clean up and not just think of financials.
— Tony Fernandes (@tonyfernandes) March 17, 2019
It is a great platform to communicate. Strong engagement and very useful but New Zealand was to much for me to take along with all the other issues.
— Tony Fernandes (@tonyfernandes) March 17, 2019