![Syrian Man Who Lost 6 Kids In Earthquake Please God Let One Survive - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/11/syria.jpg.webp?itok=Op33yYYJ)
టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆ శిథిలాల కింద చితికిన బతుకులు విషాధ గాథలు పేగులు మెలిపెట్టించేలా ఉన్నాయి. పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, అనాథలుగా మారిన చిన్నారులతో కన్నీటి సంద్రాన్ని తలిపించేలా ఉన్నాయి అక్కడి దృశ్యాలు. మరోవైపు కొందరూ ఆ శిథిలా కింద తమవారు బతికే ఉండాలని ఆత్రంగా ఎదురుచూపులు. ఆయా ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది శిథిలలు తొలగింపు కార్యక్రమాలు కొనసాగిస్తుండగా..నాజర్ అల్ వకా అనే వ్యక్తి ప్లీజ్ దేవుడా ఒక్క బిడ్డనైన బతికించు అంటూ దీనంగా విలపించాడు.
సరిగ్గా ఆ శిథిలాల వద్ద వాకా కూర్చొని వారి కోసం ఆత్రుత పడుతుండగా కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. కాంక్రీట్ దిమ్మల మధ్య చితికిపోయిన తన భార్య, పిల్లలను చూసి అతను ఏడుస్తున్న విధానం అక్కడ ఉన్న అందర్నీ కంటతడి పెట్టించింది. వాకా ఎంతమంది పిల్లలను కోల్పోయాడనేది స్పష్టం కాలేదు గానీ, ఇద్దరు పిల్లలు మాత్రం రక్షక సిబ్బంది సజీవంగా తీసినప్పటికీ కాసేపటికే వారు చనిపోయారు. అతడి పెద్ద కుమార్తె తన చెల్లెలు మృతదేహాన్నిఒడిలో పెట్టుకుని విగతజీవిగా కనిపించింది.
ఈ మేరకు వాక భూకంపం జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. సిరియా అంతర్యుద్ధంలో అతలా కుతలమైన నాటి ఘటనలు మళ్లీ పునురావృతమయ్యిందా! అన్నట్లు ఉంది అని కన్నీటిర్యంతమయ్యాడు. ఈ ఘటన జరిగినప్పుడూ తాను బయటకు పరుగుపెడుతూ..దేవుడా ఒక్క బిడ్డనైనా బతికించు చాలు అని ప్రార్థించాను, కానీ ఇప్పడూ తాను సర్వకోల్పోయానంటూ బోరుమన్నాడు. అక్కడి స్మసశాన వాటికలన్ని పెద్దలు, చిన్నారుల మృతదేహాలతో కిక్కిరిసిపోయాయి.
(చదవండి: Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య)
Comments
Please login to add a commentAdd a comment