హైదరాబాద్ బోయిన్పల్లి వద్ద నిలిపి ఉన్నబీఎండబ్ల్యూ కారులో (AP 28 BX 5675) మృతదేహం బయటపడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బోయిన్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...మృతుడు కిమ్స్ ఆస్పత్రి ఇంఛార్జ్ రాఘవేందర్గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాఘవేందర్ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.