అనుమానాస్పదరీతిలో వైద్యుడి మృతి | body found in Benz car at bowenpally | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదరీతిలో వైద్యుడి మృతి

Published Thu, Aug 27 2015 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

బోయిన్పల్లి హర్షవర్ధన్ కాలోనీలో దొరికిన బీఎండబ్ల్యూ కారు, (ఇన్ సెట్లో) డాక్టర్ రాఘవేందర్ రావు (ఫైల్) - Sakshi

బోయిన్పల్లి హర్షవర్ధన్ కాలోనీలో దొరికిన బీఎండబ్ల్యూ కారు, (ఇన్ సెట్లో) డాక్టర్ రాఘవేందర్ రావు (ఫైల్)

హైదరాబాద్‌లో ఘటన కారులో శవమై కనిపించిన రాఘవేందర్‌రావు
హైదరాబాద్: అనుమానాస్పదరీతిలో ఓ వైద్యుడు కారులో శవమై కనిపించాడు. నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన సంచనలం సృష్టించింది. పేట్ బషీరాబాద్‌లోని గేటేడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసం ఉండే డాక్టర్ రాఘవేందర్‌రావు(60) గత 12 ఏళ్లుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈఎన్‌టీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరారు.  

సాయంత్రం 6.30 గంటలైనా ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పలువూర్లు ఆయున సెల్‌కు ఫోన్ చేశారు. ఆయన ఫోను తీయుకపోవడంతో పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అమెరికాలో ఉన్న రాఘవేందర్‌రావు కుమారుడు సుదీప్‌కు సమాచారమిచ్చారు. సుదీప్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో తన తండ్రికి సంబంధించిన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 28 బీఎక్స్ 5675) ఉన్నట్లు గుర్తించి, తల్లి స్వర్ణలతకు చెప్పారు.

కుటుంబసభ్యులు హర్షవర్ధన్ కాలనీలో వెతకగా పార్క్ చేసి ఉన్న కారును గుర్తించారు. కారులో రాఘవేందర్‌రావు మృతి చెంది కనిపించాడు. అతని ముక్కు, చెవి నుంచి రక్తం కారుతూ కనిపించింది. బోయిన్‌పల్లి పోలీసులకు సమాచారమివ్వగా వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారులో రూ.14,500 నగదు, సెల్‌ఫోన్, మద్యంసీసా, ల్యాప్‌టాప్, కొన్ని మాత్రలు లభించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్రరావు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. కడుపులో మత్తు, విషపదార్థాల అనవాళ్లు లేవని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement