సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | police found pawankumar deadbody | Sakshi
Sakshi News home page

సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Published Sat, May 16 2015 8:58 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం - Sakshi

సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి(అంతర్వేది): సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహం శనివారం లభ్యమైంది. వివరాలు.. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (23) మూడు రోజుల క్రితం ఓ పెళ్లికి హాజరయ్యేందుకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి వెళ్లారు. శుక్రవారం స్నేహితులతో కలిసి సమీపంలోని సముద్ర తీరానికి వెళ్ళారు. సముద్రంలోని వెళ్ళిన పవన్ సుడిగుండం ఉండటంతో గల్లంతయ్యాడు.

పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం పవన్ మృతదేహం లభ్యమైంది. వివాహ వేడుకకని వెళ్ళిన పవన్ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం జిల్లా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement