అరటితోటలో గుర్తు తెలియని మృతదేహం | unknown dead body found in banana plantations | Sakshi
Sakshi News home page

అరటితోటలో గుర్తు తెలియని మృతదేహం

Published Tue, Feb 21 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

unknown dead body found in banana plantations

శ్రీనగరం(మహానంది): మహానంది మండలం శ్రీనగరం గ్రామం సమీపంలోని అరటితోటలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.  మహానంది ఎస్‌ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపిన వివరాల మేరకు... మ​ృతుడికి 35  నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు  ఉండొచ్చు. షర్టుపై జానీ టైలర్, నంద్యాల అని ఉంది. మృతుడి షర్టుజేబులో జపమాల, రెండు ఉంగరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పారవేశారా? అనే కోణంలో ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహంపై అరటిసొరుగు కప్పి ఉంచడంతో  స్థానికులు హత్యగా అనుమానం  వ్యక్తం చేస్తున్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement