మహిళ దారుణ హత్య
Published Wed, Nov 16 2016 12:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– ముందురోజు గొంతుకోసి.. మరుసటి రోజు పెట్రోలు పోసి తగులబెట్టి
– పోలీసుల అదుపులో నిందితుడు ?
ఆళ్లగడ్డ : అమానుషం..కిరాతకం..ఓ మహిళ గొంతు కోసి..ఆ తరువాత తగులబెట్టారు. ఈ ఘటన ఆళ్లగడ్డ మండలంలో కలకలం రేపింది. బాచేపల్లి తండా సమీపంలోని అడవిలో ఓ మహిళ మృతదేహం తగలబడుతుందని రూరల్ పోలీసులకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సమాచారం అందింది. ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ దస్తగిరిబాబు, ఎస్సై రామయ్యలు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉండటంతో అక్కడున్న ఆనవాళ్లను పరిశీలించారు. మృతిరాలి చేతికున్న పచ్చబొట్టు, అలాగే మెడలో ఉన్న అంత్రము ఆధారంగా విచారించగా దొరకట్టాల గ్రామానికి చెందిన నారాయణమ్మ (50) గా గుర్తించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
దొరకొట్టాలకు చెందిన నారయణమ్మ, బాచేపల్లితండాకు చెందిన ఆటోడ్రైవర్ నరసింహనాయక్‌ల కుటుంబాలు కలిసి మెలిసి ఉండేవి. నారాయనమ్మ కొడుకు, కోడలు ఆళ్లగడ్డ పట్టణంలో కాపురం పెట్టారు. అక్కడికి తరుచూ నరసింహనాయక్ కుటుంబం వస్తూపోతూ ఉండేవారు. ఈ క్రమంలో నారయణమ్మ కోడలుతో నరసింహనాయక్‌కు వివాహేతర సంబందం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన నారాయణమ్మ, కుమారుడు నరసింహనాయక్‌ను ఇంటిదగ్గరకు రానివ్వవద్దని తరుచూ గొడవపడేవారు. గతంతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కాని ఆదివారం నరసింహనాయక్ దొరకొట్టాలకు వెళ్లి.. నారాయణమ్మను మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకుని నగిరిబాయి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి గొంతు కోసి హత్యచేసి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తిరిగి మంగళవారం ఉదయం పెట్రోలు తీసుకుని పోయి మృతదేహంపై పోసి నిప్పు పెట్టాడు. దీంతో మృతదేహం గుర్తు పట్టలేనంతగా కాలిపోయింది. అడవిలోకి వెల్లిన పశులకాపరులు ఏవో మంటలు వస్తున్నాయని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాల వారు, మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితుడు ?
మహిళలను నమ్మించి తీసుకుపోయి దారుణ హత్యకు వడిగట్టిన నరసింహనాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో అతనితోపాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారన్న కోనంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement