Popular Actor Daughter Husband Bala Dhandayuthapani Found Suspicious Death In Chennai, Details Inside - Sakshi
Sakshi News home page

నటుడి కుమార్తె భర్త కిడ్నాప్‌.. రాజ్యలక్ష్మి ఇంట్లో డెడ్‌ బాడీ.. ఏం జరిగింది..?

Published Wed, Apr 6 2022 7:19 AM

Suspicious death of bala dhandayuthapani - Sakshi

తిరువొత్తియూరు : మదురైలో కిడ్నాప్‌నకు గురైన ప్రముఖ నటుడి కుమార్తె భర్త చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆస్తుల కోసం హత్య జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. మదురై జిల్లా తల్లాకులం ప్రాంతానికి చెందిన బాల దండాయుధపాణి(50). ఇతని భార్య రాజ్యలక్ష్మి. ఈమె దివంగత ప్రముఖ సినీ నటులు సెందామరైకి ఏకైక కుమార్తె. ఈ క్రమంలో దంపతుల మధ్య ఏర్పడిన విభేదాల వల్ల ఏడేళ్లుగా భార్య నుంచి విడిపోయి బాల దండాయుధపాణి ఒంటరిగా ఉంటున్నారు. మార్చి 13వ తేదీన బాల దండాయుధపాణి అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈక్రమంలో సోమవారం రాత్రి బాలదండాయుధపాణి చెన్నైలోని మదురవాయిల్‌ ఎం.జి.శంకర పాణి వీధిలో ఉన్న రాజ్యలక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement