గంటలో హామీ అమలు | YS Jagan Mohan Reddy Financial Help To Illness Victims | Sakshi
Sakshi News home page

గంటలో హామీ అమలు

Published Thu, Jan 4 2024 7:57 AM | Last Updated on Thu, Jan 4 2024 8:39 AM

YS Jagan Mohan Reddy Financial Help To Illness Victims - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పర్యటన సందర్భంగా బుధవారం తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితుల పరిస్థితి చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్‌ తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం కార్యక్రమం ముగించుకుని వెళ్లిన గంటలోపే తొమ్మిది మందికి రూ.13 లక్షల ఆర్థిక సాయాన్ని కలెక్టరేట్‌లో చెక్కు రూపంలో అందజేశారు. వీరిలో 8 మందికి రూ.లక్ష చొప్పున ఇవ్వగా ఒక బాధితుడికి రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.13 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్‌ అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన గంటలోపే సాయం అందడంపై  బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.   

సాయివెంకట్‌కిరణ్‌ తల్లికి రూ.లక్ష, కోట సత్యసాయి జన్విర్‌కు రూ.లక్ష, జి.సుష్మశ్రీ తండ్రికి రూ.లక్ష, పత్తికాయల డేవిడ్‌ రోషన్‌కు రూ.లక్ష, దూడ రవికుమార్‌కు రూ.లక్ష, గనిశెట్టి రూపాలక్ష్మికి రూ.లక్ష, మర్రిరపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు, పటేల కుష్మిత కుమారికి రూ.లక్ష, గనిశెట్టి కనక మహాలక్ష్మికి రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా 
 

   కాకినాడ భానుగుడి తిరుమలశెట్టి వీధికి చెందిన కృష్ణారావు కుమారుడు 41 ఏళ్ల మర్రిపూడి విశ్వేశ్వరరావుకు రూ.5 లక్షలు. 
►    కాకినాడ రూరల్‌ మండలం సర్పవరానికి చెందిన శ్రీనివాస్‌ కుమారుడు ఏడేళ్ల జి.జయసాయి వెంకట కిరణ్‌ కిడ్నీ చికిత్సకు రూ.లక్ష.
►   కరప మండలం వేములవాడకు చెందిన నాగార్జున కుమారుడు కోట సత్య వెంకట సాయి జశి్వక్‌ వైద్యానికి రూ.లక్ష. 
►   పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలిక జి.సుష్మశ్రీ వైద్యానికి రూ.లక్ష. 
►   కాకినాడ గాం«దీనగర్‌కు చెందిన పి.శ్రీనివాస్‌ కుమారుడు 17 ఏళ్ల పత్తికాయల డేవిడ్‌ రోషన్‌ వైద్యం నిమిత్తం రూ.లక్ష. 
►   యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన చిట్టిబాబు కుమారుడు 17 ఏళ్ల దూడ రవికుమార్‌ వైద్యానికి రూ.లక్ష. 
►   పిఠాపురం మండలం కోలంకకు చెందిన రెండేళ్ల బాలిక గనిశెట్టి రూపాలక్ష్మి వైద్య సహాయానికి రూ.లక్ష. 
►   కాకినాడ పల్లంరాజు నగర్‌కు చెందిన కులదీప్‌కుమార్‌ కుమార్తె మూడేళ్ల పటేలా కుష్మిత కుమారికి రూ.లక్ష. 
►   కరపకు చెందిన 11 సంవత్సరాల బాలిక గనిశెట్టి కనకమహాలక్ష్మి కి రూ.లక్ష.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement