రూ.లక్ష చెక్కు అందజేస్తున్న కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం సిటీ: తన బిడ్డకు వైద్యం అందించాలని ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా కొవ్వూరు మండలం ఔరంగబాద్‌కు చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతోందని అర్జీ అందజేశారు. సీఎం స్పందించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం తన చాంబర్‌లో నిస్సి తల్లికి రూ.లక్ష చెక్కును కలెక్టర్ మాధవీలత అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ఆరాధ్య తల్లితండ్రులు పాక స్వరూప్, అపర్ణలకు ధైర్యం చెప్పారు. బిడ్డ ఆరాధ్య అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పాప వైద్య సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌కు అప్పగించామని వివరించారు. పాప తండ్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి సీఎం కార్యాలయం లెటర్ ఆఫ్ అధారటీ లేఖ ఇచ్చిందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment