
రాజమహేంద్రవరం రూరల్: మాటిస్తే అమలు చేస్తానని మరోమారు నిరూపించుకున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వివరాలివి. ముఖ్యమంత్రి గత నెల 24న కొవ్వూరు పర్యటనకు వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరుకు వలస వచ్చిన రేవాడి దుర్గ దంపతులు ఈసందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇంటి స్థలం అవస్థలు పడుతున్నామని ఆయనకు అర్జి అందజేశారు.
ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇళ్ల స్థలం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాధవీలతను ఆదేశించారు. ఆమె చొరవ తీసుకుని సాంకేతిక పరంగా ఉన్న అడ్డంకిని పరిష్కరించి కొవ్వూరు జగనన్న కాలనీలో నివాస స్థలం మంజూరు చేశారు. సోమవారం దుర్గకు ఇంటి పట్టా అందజేశారు. రేవాడి దుర్గ మాట్లాడుతూ తమకు ఇంత త్వరగా ఇంటి స్థలం మంజూరవుతుందని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు.సీఎ జగన్‌కు.. కలెక్టర్ మాధవీలతకు కృతజ్ఞతలు తెలిపారు.