ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆంధ్రప్రదేశ్ కు ఒక్క పైసా తేలేదని, అజ్ఞానంతో ఉన్నవారు మాత్రమే ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని ఏపీ ప్రత్యేకహోదా, విభజన హామీల సమితి విమర్శించింది. ప్రజాప్రతినిధులుగా ఉన్న నందమూరి బాలకృష్ణ, చిరంజీవి ప్రత్యేకహోదా అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించింది. తమిళనాడు స్ఫూర్తితో ప్రత్యేకహోదా కోసం సినీపరిశ్రమ మద్దతు తెలపాలని కోరింది. ప్రత్యేకహోదా ఉద్యమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.