
సీఎం హామీ నీటి మూటే..!
ఈ ఫొటోలో ఉన్నది గత నెల 28న సీఎం చంద్రబాబు రెయిన్‌గన్లు ప్రారంభించిన వేరుశనగ పొలం. స్వయానా ఆయనే రెయిన్‌గన్ ప్రారంభించి ‘పంట పండేంత వరకూ నీటిని సరఫరా చేస్తాం’ అని బాధిత రైతు శివన్నకు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ బుట్టదాఖలైంది. కాగా ఈ పొలం అమడగూరు నుంచి కదిరికి వెళ్లే ప్రధాన ర హదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులంతా ఎండిన పొలాన్ని చూస్తూ సీఎం రెయిన్‌గన్లు ప్రారంభించి పంటే ఎండిపోతుంటే మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.