రైతులకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ సర్కారు
ఏడాది పాలన పూర్తయినా హామీలు అమలుకాలేదు..
హామీల అమలు డిమాండ్‌తో వచ్చేవారం నిరసనలు
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడి
సాక్షి. హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీది ప్రజాప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం. అది చేతల ప్రభుత్వం కాదు.. మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి ఇచి్చన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శుక్రవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆ పార్టీ నాయకుల ఆర్థిక స్థితిలో మార్పు వచ్చిందే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు.
ఆశచూపి వెన్నుపోటు
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆశచూపి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రైతు లు, కూలీలు, కౌలు రైతుల డేటా అంతా ప్రభుత్వం వద్ద ఉండగా.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు అడుగుతున్నారని ప్రశ్నించారు.
‘గతంలో దరఖాస్తులు తీసుకున్నారు..సర్వే చేశారు.. ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు ఎందుకు? రైతు భరోసా కింద ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు కూడా సంకెళ్లు వేసింది’అని విమ ర్శించారు. రైతులకు నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్లు నవంబర్ 30వ తేదీనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఆ డబ్బులు ఇంకా రైతు ల ఖాతాల్లో పడలేదని తెలిపారు.
ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి రెండో వారంలో రైతుల సమస్యలు, హామీల అమలుపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల ఆఫీసర్లు, తహసీల్దార్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచినప్పుడు తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.
సమగ్రశిక్ష ఉద్యోగులకు కేంద్రం అండగా నిలుస్తుంది
సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం దిల్ కుశ అతిథి గృహంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, సమగ్ర శిక్ష ప్రతినిధులు.. కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష కార్యక్రమ అమలుకు కేంద్రం తన వాటా కింద 60 శాతం నిధులు, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, అనిల్ చారి తెలిపారు.
రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందు కు సమగ్ర శిక్ష ఉద్యోగులు కృషి చేస్తున్నా, చాలీచాలని వేతనాల తో సతమతమవుతున్నామని వాపోయారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్రం ఇచ్చే 60 శాతం నిధుల వాటాను కొనసాగించాలని ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment