హామీలను అమలు చేయడం లేదు
హామీలను అమలు చేయడం లేదు
Published Thu, Oct 6 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
నార్కట్‌పల్లి : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా ప్రజలను, రైతులను మాటల గారడీతోనే పాలన వెల్లబుచ్చుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతులు అడగక ముందుకే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ రుణమాఫీ చేయకుండా విడతలుగా ఏర్పాటు చేసి అదీ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ నిరుద్యోగుల సమస్య ఈనాటికి పరిష్కారం కాలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎస్సీలకు ఇస్తామని చెప్పి కేవలం తన జిల్లాకే ఇస్తే రాష్ట్రమంతటా ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రైతులు, ప్రజలే ముందుకు వస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీటీసీలు ఐతరాజు యాదయ్య, కన్నెబోయిన వెంకటాద్రి, దాసరి కృష్ణ, సర్పంచ్ కొండూరు శంకర్, దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు జహంగీర్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, శశిధర్‌రెడ్డి, సైదులు, సత్తిరెడ్డి, సత్తి, మనోహర్, వెంకటచారి, శంకర్, సలీం తదితరులున్నారు.
Advertisement
Advertisement